ప్రపంచ కప్ ట్రోఫీని గుడికి తీసుకెళ్లడంపై దిగ్గ‌జ క్రికెట‌ర్ వ్యాఖ్య‌లు.. గ‌ట్టిగానే రియాక్టైన గంభీర్..!

భారత జట్టు ఫైనల్లో న్యూజిలాండ్‌ను ఓడించి 2026 T20 ప్రపంచ కప్‌ను గెలుచుకుంది.

By -  Medi Samrat
Published on : 11 March 2026 12:06 PM IST

ప్రపంచ కప్ ట్రోఫీని గుడికి తీసుకెళ్లడంపై దిగ్గ‌జ క్రికెట‌ర్ వ్యాఖ్య‌లు.. గ‌ట్టిగానే రియాక్టైన గంభీర్..!

భారత జట్టు ఫైనల్లో న్యూజిలాండ్‌ను ఓడించి 2026 T20 ప్రపంచ కప్‌ను గెలుచుకుంది. రికార్డు స్థాయిలో మూడోసారి T20 ప్రపంచ కప్‌ను గెలుచుకున్న తర్వాత జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, కోచ్ గౌతమ్ గంభీర్, జే షా ట్రోఫీతో హనుమాన్ ఆలయానికి చేరుకున్నారు. టీఎంసీ ఎంపీ, మాజీ క్రికెటర్ కీర్తి ఆజాద్ కెప్టెన్ ఆలయ సందర్శనపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. దీనిని సిగ్గుచేటు చర్యగా అభివర్ణించారు. ఆజాద్ ప్రకటనపై కోచ్ గౌతమ్ గంభీర్ తీవ్రంగా స్పందించారు.

నిజానికి 1983 ప్రపంచ కప్ గెలిచిన జట్టులో సభ్యుడిగా ఉన్న కీర్తి ఆజాద్, ప్రపంచ ఛాంపియన్ అయిన తర్వాత భారత జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, కోచ్ గౌతమ్ గంభీర్, జై షా ఆలయాన్ని సందర్శించడాన్ని ప్రశ్నించాడు. ట్రోఫీని ఆలయానికి మాత్రమే ఎందుకు తీసుకెళ్లారని అడిగాడు. అలా చేసి ఉంటే.. ఇతర మతాల ప్రార్థనా స్థలాలకు కూడా విస్తరించాల్సిందని ఆయన అన్నారు. ఈ చర్య వివక్షతతో కూడుకున్నదని ఆజాద్ అన్నారు.

ఈ ఆరోపణలపై గౌతమ్ గంభీర్ స్పందిస్తూ.. ఇటువంటి ప్రకటనలు అన్యాయమని.. ఆటగాళ్ల కృషిని, విజయాలను తగ్గిస్తాయని అన్నారు. ఇది మొత్తం దేశానికి గర్వకారణమైన క్షణం.. దీనిని జరుపుకోవాలని ఆయన అన్నారు. వార్తా సంస్థ ANI పాడ్‌కాస్ట్ సందర్భంగా.. కీర్తి ఆజాద్ ట్వీట్ గురించి అడగ‌గా.. గంభీర్ ఇలా అన్నాడు.

ఆ ప్రశ్నకు సమాధానం చెప్పడం కూడా విలువైనది కాదు. దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో ఓడిపోవడం, ఆ తర్వాత, ఆటగాళ్ళు ఎదుర్కొన్న ఒత్తిడి, ఈ రోజు మీరు అలాంటి ప్రకటన ఇస్తున్నారు, మీరు అలాంటి ప్రకటన ఇస్తుంటే మీరు నిజంగా మీ స్వంత ఆటగాళ్లను, మీ స్వంత జట్టును అవమానిస్తున్నాట్లు ఇది చేయకూడదు అన్నారు.

ఈ వివాదం మధ్య భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ కూడా కీర్తి ఆజాద్ వ్యాఖ్యను విమర్శించి జట్టుకు మద్దతు ఇచ్చాడు.

Next Story