టీమిండియా హెడ్‌కోచ్, బీజేపీ మాజీ ఎంపీ గౌతమ్ గంభీర్‌కు ఐసిస్ కశ్మీర్ నుంచి బెదిరింపులు వచ్చాయి. తనను చంపుతామంటూ 'ఐసిస్ కశ్మీర్' నుంచి రెండు మెయిల్స్ వచ్చాయని ఢిల్లీ పోలీసులకు ఆయన ఫిర్యాదు చేశాడు. తనతో పాటు కుటుంబ సభ్యులకు భద్రత కల్పించాలని కోరాడు. పహల్గాం ఉగ్రదాడిని ఎక్స్ మాధ్యమంలో గంభీర్ ఖండించిన కొన్ని గంటల్లోనే ఈ బెదిరింపులు వచ్చాయి.
ఏప్రిల్ 22న రెండు బెదిరింపు మెయిల్స్ వచ్చినట్లు గంభీర్ చెప్పారు. ఒకటి మధ్యాహ్నం, మరొకటి సాయంత్రం వచ్చినందని వివరించారు. ఈ రెండు మెయిల్స్‌లో "IKillU." (నిన్ను చంపేస్తాం) అని వచ్చినట్లు వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే కేసు నమోదు చేసిన సైబర్ సెల్ మెయిల్స్ ఎక్కడినుంచి వచ్చాయి? ఎవరు పంపారనే దానిపై విచారణ చేపట్టింది.
గంభీర్‌కు ఇలాంటి బెదిరింపులు రావడం ఇది మొదటిసారి కాదు. నవంబర్ 2021లో ఆయన ఎంపీగా ఉన్న సమయంలో కూడా ఇలాంటి ఈ-మెయిల్ వచ్చింది. కాగా, మంగళవారం పహల్గామ్‌లో పర్యాటకులపై ఉగ్రవాదులు జరిపిన పాశవిక దాడిని గంభీర్ 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా తీవ్రంగా ఖండించిన విషయం తెలిసిందే.