ఆ ప్ర‌శ్న‌కు సమాధానం ఇవ్వకుండానే వెళ్లిపోయిన గంభీర్..!

2026 T20 ప్రపంచ కప్‌లో భారత్‌తో జరిగే మ్యాచ్‌లను పాకిస్తాన్ బహిష్కరించడం గురించి వచ్చిన ప్రశ్నలను భారత ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ పట్టించుకోలేదు.

By -  Medi Samrat
Published on : 4 Feb 2026 9:10 PM IST

ఆ ప్ర‌శ్న‌కు సమాధానం ఇవ్వకుండానే వెళ్లిపోయిన గంభీర్..!

2026 T20 ప్రపంచ కప్‌లో భారత్‌తో జరిగే మ్యాచ్‌లను పాకిస్తాన్ బహిష్కరించడం గురించి వచ్చిన ప్రశ్నలను భారత ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ పట్టించుకోలేదు. సున్నితమైన ఈ అంశంపై గంభీర్ మౌనంగా ఉన్నాడు. గౌతమ్ గంభీర్ మంగళవారం సాయంత్రం ముంబైకి బయలుదేరాడు. విమానాశ్రయంలో జర్నలిస్టులు గంభీర్‌ను ప్రశ్నలు అడిగారు. రాబోయే T20 ప్రపంచ కప్ కోసం భారత జట్టుకు శుభాకాంక్షలు తెలిపారు. జర్నలిస్టుల శుభాకాంక్షలకు గంభీర్ ధన్యవాదాలు తెలిపారు.

దీని తరువాత, భారత్‌తో మ్యాచ్ ఆడకూడదని పాకిస్తాన్ తీసుకున్న నిర్ణయంపై మీరు ఏమి చెబుతారని అడగ‌గా.. ఈ ప్రశ్నకు గంభీర్ సమాధానం ఇవ్వలేదు. ఎటువంటి స్పందన ఇవ్వకుండా అక్కడి నుండి ఆయ‌న వెళ్లిపోయాడు. బుధవారం ముంబైలో దక్షిణాఫ్రికాతో భారత జట్టు ప్రాక్టీస్ మ్యాచ్ ఆడనున్న విషయం తెలిసిందే.

పాకిస్తాన్ ప్రభుత్వం తన క్రికెట్ జట్టును 2026 T20 ప్రపంచ కప్‌లో పాల్గొనడానికి అనుమతించిందని, కానీ వారిని భారతదేశంతో ఆడటానికి అనుమతించలేదు. ప్రపంచ స్థాయిలో భారత్-పాకిస్తాన్ మ్యాచ్ కు ఆర్థికంగా, క్రీడాపరంగా ప్రాముఖ్యత ఉన్నందున ఈ నిర్ణయం విస్తృత చర్చకు దారితీసింది.

PCB బహిష్కరణకు పాల్పడినట్లు ICCకి అధికారికంగా సమాచారం ఇవ్వలేదు. షెడ్యూల్ ప్రకారం మ్యాచ్ జరగకపోతే తీవ్రమైన పరిణామాలు ఉంటాయని ఐసీసీ ఇప్పటికే హెచ్చరించింది.

Next Story