గంభీర్ మంచి కోచ్ అవుతాడు : సౌరవ్ గంగూలీ

గౌతమ్ గంభీర్ భారత క్రికెట్ జట్టు కోచ్ పదవికి దరఖాస్తు చేసుకుంటే మంచి కోచ్ అవుతాడని భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ అభిప్రాయపడ్డారు.

By Medi Samrat
Published on : 1 Jun 2024 9:15 PM IST

గంభీర్ మంచి కోచ్ అవుతాడు : సౌరవ్ గంగూలీ

గౌతమ్ గంభీర్ భారత క్రికెట్ జట్టు కోచ్ పదవికి దరఖాస్తు చేసుకుంటే మంచి కోచ్ అవుతాడని భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ అభిప్రాయపడ్డారు. టీమిండియా హెడ్ కోచ్ పదవిని చేపట్టడానికి గంభీర్ ఆసక్తిని కనబరిచినట్లు వార్తలు వచ్చాయి. దీంతో గంభీర్ గురించి పలువురు మాజీ క్రికెటర్లు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

ఇంటర్నేషనల్ ప్రొక్యూర్‌మెంట్ అండ్ సప్లై చైన్ కాన్ఫరెన్స్ ప్రారంభోత్సవంలో గంగూలీ మాట్లాడుతూ భారత జట్టు కోచ్ పదవికి దరఖాస్తు చేస్తే గంభీర్ మంచి కోచ్ అవుతాడని గంగూలీ అన్నారు. జూన్‌లో రాహుల్ ద్రవిడ్ పదవీకాలం ముగియనుండడంతో BCCI ఈ ఉద్యోగం కోసం దరఖాస్తులను పిలిచింది. USA- వెస్టిండీస్‌లలో జరుగుతున్న T20 ప్రపంచ కప్‌ ద్రవిడ్ కు చివరి అసైన్‌మెంట్. ప్రధాన కోచ్ పదవికి దరఖాస్తు చేసుకోవడానికి మే 27 చివరి తేదీ. ఎవరెవరు కోచ్ పదవికి అప్లై చేసుకున్నారో ఇంకా అధికారిక ప్రకటన రాలేదు.

Next Story