ఏంటి.. వాళ్లు వేలంపాటలో అందుబాటులో ఉండరా?

నవంబర్ 24 మరియు 25 తేదీల్లో సౌదీ అరేబియాలోని జెడ్డాలో జరిగే IPL ప్లేయర్ వేలంలో ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ లేడని తెలుస్తోంది.

By Kalasani Durgapraveen  Published on  16 Nov 2024 8:33 AM IST
ఏంటి.. వాళ్లు వేలంపాటలో అందుబాటులో ఉండరా?

నవంబర్ 24 మరియు 25 తేదీల్లో సౌదీ అరేబియాలోని జెడ్డాలో జరిగే IPL ప్లేయర్ వేలంలో ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ లేడని తెలుస్తోంది. ఈ జాబితాలో మొత్తం 574 మంది ఆటగాళ్లు ఉన్నారు, ఇందులో 366 మంది భారతీయులు, 208 మంది విదేశీ ఆటగాళ్లు ఉన్నారు. ఆర్చర్ షార్ట్ లిస్ట్ చేసిన ఆటగాళ్లలో లేనప్పటికీ, 42 ఏళ్ల జేమ్స్ ఆండర్సన్ మాత్రం వేలంపాటలో తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. 10 జట్లకు మొత్తం 204 స్లాట్‌లు అందుబాటులో ఉన్నాయి. వాటిలో 70 మంది విదేశీ ఆటగాళ్లకు అవకాశం ఉంది.

RCB - MI మధ్య జరిగిన మెగా ట్రేడ్ డీల్‌లో భాగమైన కామెరాన్ గ్రీన్ కూడా తుది జాబితాలో లేడు. ఇటీవల వెన్నెముకకు శస్త్రచికిత్స చేయించుకున్న గ్రీన్ ఈ లిస్ట్‌లో లేడు. ఆరు నెలల పాటు అతడి సేవలు అందుబాటులో ఉండవని ఆసీస్ క్రికెట్ బోర్డు తెలిపింది.

ప్రారంభంలో వేలం కోసం 1574 మంది ఆటగాళ్లు నమోదు చేసుకున్నారు ఇప్పుడు ఆ సంఖ్యను 1000 తగ్గించారు. వేలంలో రెండు సెట్ల మార్క్యూ ప్లేయర్‌లు అందుబాటులో ఉంటారు. M1లో జోస్ బట్లర్, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్, కగిసో రబడ, అర్ష్‌దీప్ సింగ్, మిచెల్ స్టార్క్ ఉన్నారు. M2లో యుజ్వేంద్ర చాహల్, లియామ్ లివింగ్‌స్టోన్, డేవిడ్ మిల్లర్, KL రాహుల్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్ ఉన్నారు. ఈ 12 మంది ఆటగాళ్లలో మిల్లర్ మాత్రమే 1.50 కోట్ల రిజర్వ్ ధర కలిగి ఉండగా, ఇతరులు 2 కోట్ల బేస్ ధరతో వేలంపాటలో అందుబాటులోకి రానున్నారు.

Next Story