కోహ్లీ ఆడిన మ్యాచుల్లో వాళ్లు సగం కూడా ఆడలేదు
Former India coach slams selectors for Kohli's captaincy snub.విరాట్ కోహ్లీని వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించి ఆ
By తోట వంశీ కుమార్ Published on 18 Dec 2021 5:01 AM GMTవిరాట్ కోహ్లీని వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించి ఆ బాధ్యతలను రోహిత్ శర్మకు సెలక్టర్లు అప్పగించిన సంగతి తెలిసిందే. ఇప్పటికీ దీనిపై పెద్ద చర్చే నడుస్తోంది. ఇక విరాట్ కోహ్లీ సౌతాఫ్రికాకు వెళ్లేముందుకు నిర్వహించిన మీడియా సమావేశంలో ఈ విషయంపై మాట్లాడుతూ.. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ)పై అసహనం వ్యక్తం చేశాడు. తనను వన్డే కెప్టెన్సీ నుంచి తొలగిస్తున్నారనే వార్త.. జట్టును ప్రకటించడానికి గంటన్నర ముందు మాత్రమే వెల్లడించారని చెప్పాడు. అంతేకాదు.. తాను టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకుంటానని చెప్పినప్పుడు బీసీసీఐ పెద్దలు ఎవ్వరూ కూడా తనను వద్దు అని చెప్పలేదన్నాడు.
అనంతరం బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ మాట్లాడుతూ.. కోహ్లీ వ్యాఖ్యలపై తాను చెప్పాల్సింది ఏమీ లేదని.. బీసీసీఐ ఆ విషయాన్ని చూసుకుంటుందన్నాడు. దీంతో ఈ కెప్టెన్సీ వివాదం ప్రస్తుతం కోహ్లీ వర్సెస్ బీసీసీఐ మారింది. దీనిపై భారత మాజీ ఆల్‌రౌండర్ కీర్తీ ఆజాద్.. కోహ్లికి మద్దతిస్తూ బీసీసీఐ సెలక్టర్లను ఏకీపారేశాడు. వన్డే కెప్టెన్సీ నుంచి కోహ్లీని తొలగిస్తున్నట్లు సెలక్టర్లు చెప్పడం కరెక్టు కావొచ్చు. కానీ చెప్పిన విధానం మాత్రం సరికాదన్నారు. భారత జట్టు తరుపున కోహ్లీ ఎన్నో అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాడని.. జట్టుకు ఎన్నో గొప్ప విజయాలు అందించాడని తెలిపారు.
ఇక ఇప్పుడున్న సెలక్టర్లు చాలా గొప్పవాళ్లు కావొచ్చు.. కానీ కోహ్లీకి ఆడిన మ్యాచ్‌ల్లో వారు సగం కూడా ఆడలేదన్నారు. ఇక తాను సెలక్టర్ ఉన్న సమయంలో ముందు జట్టును ఎంపిక చేసి తరువాత ప్రెసిడెంట్ దగ్గరకు పంపేవాళ్లమని.. ఆయన ఓ సారి పరిశీలించి ఓకే అన్న తరువాత జట్టును ప్రకటించేవాళ్లమని తెలిపాడు. ప్రస్తుతం ఇది పూర్తిగా మారినట్లు చెప్పుకొచ్చాడు. ఇక సౌతాఫ్రికా గడ్డపై అడుగుపెట్టిన టీమిండియా అక్కడ మూడు టెస్టులు, మూడు వన్డేలు ఆడనుంది.