బీసీసీఐ కొత్త అధ్యక్షుడు ఆయ‌నే.. ఆ రాష్ట్రం నుంచి ఐపీఎల్ ఆడిన తొలి ఆట‌గాడు..!

సెప్టెంబరు 28న జరగనున్న వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎం)కి ముందు బోర్డు ఖాళీగా ఉన్న పోస్టులకు అభ్యర్థులను ఖరారు..

By -  అంజి
Published on : 21 Sept 2025 10:11 AM IST

Former Delhi captain, Mithun Manhas, BCCI new president, Cricket

బీసీసీఐ కొత్త అధ్యక్షుడు ఆయ‌నే.. ఆ రాష్ట్రం నుంచి ఐపీఎల్ ఆడిన తొలి ఆట‌గాడు..!

సెప్టెంబరు 28న జరగనున్న వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎం)కి ముందు బోర్డు ఖాళీగా ఉన్న పోస్టులకు అభ్యర్థులను ఖరారు చేసేందుకు అనుభవజ్ఞులైన నిర్వాహకులు, బీసీసీఐ కీలక నిర్ణయాధికారులు శనివారం అనధికారిక సమావేశాన్ని నిర్వహించారు. వర్గాల సమాచారం ప్రకారం.. ఎవరి పేర్లను పరిగణనలోకి తీసుకున్నారో వారిని సమావేశానికి పిలిచారు. జమ్మూ క్రికెట్ అసోసియేషన్ నుంచి వచ్చిన మాజీ క్రికెటర్ మిథున్ మన్హాస్ బీసీసీఐ అధ్యక్షుడి ప‌ద‌వి రేసులో ఉండ‌గా, రాజీవ్ శుక్లా తన పాత ఉపాధ్యక్ష పదవిలో కొనసాగనున్నారు.

అదే సమయంలో కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ (KSCA) అధ్యక్షుడు రఘురామ్ భట్ కోశాధికారి అయ్యే అవ‌కాశం ఉంది. కెఎస్‌సిఎ అధ్యక్షుడిగా భారత మాజీ స్పిన్నర్ భట్ పదవీకాలం సెప్టెంబర్ 30తో ముగుస్తుంది. దేవ్‌జిత్ సైకియా కార్యదర్శిగా కొనసాగుతుండగా, ప్రభతేజ్ భాటియా జాయింట్ సెక్రటరీగా బాధ్య‌త‌లు చేప‌ట్ట‌నున్నారు. అరుణ్‌సింగ్‌ ధుమాల్‌ మరోసారి ఐపీఎల్‌ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు. పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ ప్రతినిధిగా ఏజీఎంకు పంపబడిన మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ఈ సమావేశానికి హాజరయ్యారు. కీలకమైన పోస్టుల్లో ఆటగాళ్లకు స్థానం కల్పించాలని అధికార బీజేపీ కోరుకుంటోంది. అయితే, పార్టీ చాలా అరుదుగా క్రీడా సంస్థల వ్యవహారాల్లో చురుకుగా జోక్యం చేసుకుంటుంది.

ఇదిలా ఉండగా, జాతీయ సీనియర్ సెలక్షన్ కమిటీలో ఎస్ శరత్ స్థానంలో ప్రజ్ఞాన్ ఓజాను నియమించాలని కూడా నిర్ణయించారు. విఎస్ తిలక్ నాయుడు స్థానంలో జూనియర్ సెలక్షన్ కమిటీకి కొత్త ఛైర్మన్‌గా శరత్ నియమితులయ్యారు. అదే సమయంలో ప్రస్తుత సీనియర్ జాతీయ క్రికెట్ జట్టు సెలెక్టర్ సుబ్రొతో బెనర్జీ స్థానంలో మాజీ ఫాస్ట్ బౌలర్ ఆర్‌పి సింగ్‌ని తీసుకోనున్నారు. సెప్టెంబర్ 28 నుంచి కొత్త సెలక్షన్ కమిటీలు బాధ్యతలు చేపట్టనున్నారు.

ఇదిలావుంటే.. మిథున్ మన్హాస్ భారతీయ మాజీ ఫస్ట్-క్లాస్ క్రికెటర్, ప్రస్తుత కోచ్. కుడిచేతి వాటం బ్యాట్స్‌మన్ అయిన అతను కుడిచేతి వాటం ఆఫ్-స్పిన్ కూడా బౌలింగ్ చేశాడు. అప్పుడప్పుడు వికెట్ కీపింగ్ కూడా చేశాడు. అతను జమ్మూ కాశ్మీర్ నుండి ఐపీఎల్‌లో ఆడిన తొలి ఆటగాడు కావ‌డం విశేషం.

వీరే బీసీసీఐకి కొత్త అధిప‌తులు

అధ్యక్షుడు - మిథున్ మన్హాస్

వైస్ ప్రెసిడెంట్ - రాజీవ్ శుక్లా

కోశాధికారి - రఘురామ్ భట్

కార్యదర్శి - దేవ్‌జిత్ సైకియా

జాయింట్ సెక్రటరీ - ప్రభతేజ్ భాటియా

IPL ఛైర్మన్ - అరుణ్ సింగ్ ధుమాల్

Next Story