ఫ్యాన్స్ ర‌చ్చ రచ్చ‌.. స్టేడియంలో కొట్టుకున్న పాక్‌- అఫ్గాన్ అభిమానులు

Fans hit each other with chairs at stadium after Pakistan beat Afghanistan in Asia Cup.త‌మ జ‌ట్టు ఓట‌మిని జీర్ణించుకోలేని

By తోట‌ వంశీ కుమార్‌  Published on  8 Sep 2022 4:57 AM GMT
ఫ్యాన్స్ ర‌చ్చ రచ్చ‌.. స్టేడియంలో కొట్టుకున్న పాక్‌- అఫ్గాన్ అభిమానులు

త‌మ జ‌ట్టు ఓట‌మిని జీర్ణించుకోలేని ఫ్యాన్స్‌ ప్ర‌త్య‌ర్థి జ‌ట్టు అభిమానుల‌పై దాడుల‌కు పాల్ప‌డ్డారు. వారిని చిత‌క‌బాదారు. స్టేడియంలోని కుర్చీల‌ను విర‌గొట్ట‌డంతో పాటు పీకిప‌డేశారు. బాటిళ్లు విసిరేశారు. ర‌చ్చ ర‌చ్చ చేశారు. ప్ర‌త్య‌ర్థి జ‌ట్టు అభిమానులు కూడా దాడుల‌కు దిగ‌డంతో స్టేడియంలో ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. పాకిస్తాన్‌- భార‌త్ మ్యాచ్‌లో ఈ ఘ‌ట‌న జ‌రిగింద‌నుకుంటే పొర‌బాటే. ఆసియాక‌ప్‌లో భాగంగా బుధవారం పాకిస్తాన్‌-ఆఫ్గానిస్థాన్ మ్యాచ్ అనంత‌రం ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది.

వివ‌రాల్లోకి వెళితే ఇబ్ర‌హీమ్ జ‌ద్రాన్‌(37), హ‌జ్ర‌తుల్లా(21), ర‌షీద్ ఖాన్‌(18 నాటౌట్ )లు రాణించ‌డంతో తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్థాన్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 6 వికెట్ల న‌ష్టానికి 129 ప‌రుగులు చేసింది. పాక్ బౌల‌ర్ల‌లో ర‌వూఫ్ రెండు వికెట్లు ప‌డ‌గొట్ట‌గా.. న‌సీమ్ షా, హ‌స్‌నైన్‌, న‌వాజ్‌, షాదాబ్ త‌లా ఓ వికెట్ తీశారు. అనంత‌రం 130 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన పాక్ 19.2 ఓవ‌ర్ల‌లో 9 వికెట్లు కోల్పోయి 131 ప‌రుగుల చేసి విజ‌యం సాధించింది. పాక్ బ్యాట‌ర్ల‌లో షాదాబ్‌(36), ఇప్తికార్‌(30) రాణించారు.

6 బంతుల్లో 11 పరుగులు

లక్ష్య చేద‌న‌లో పాక్ బ్యాట‌ర్లు త‌డ‌బ‌డ‌డంతో మ్యాచ్ ఉత్కంఠ‌కు దారి తీసింది. ఆఖ‌రి ఓవ‌ర్‌లో పాక్ విజ‌యానికి 11 ప‌రుగులు అవ‌స‌రం కాగా.. ఒక్క వికెట్ తీసినా లేదా 11 ప‌రుగులు ఇవ్వ‌కున్నా అఫ్గాన్ గెలుస్తుంది. పైన‌ల్‌కు చేరుకోవాలంటే ఈ మ్యాచ్‌లో విజ‌యం సాధించ‌డం అఫ్గాన్‌కు చాలా అవ‌స‌రం. ఆఖ‌రి ఓవ‌ర్‌లో పాక్ బ్యాట‌ర్ న‌సీమ్ షా(4 బంతుల్లో 14 నాటౌట్‌, 2 సిక్స్‌లు) తొలి రెండు బంతుల‌ను సిక్స‌ర్లు బాది పాక్ జ‌ట్టుకు అద్భుత విజ‌యాన్ని అందించాడు.

ఈ పరిణామం అఫ్గాన్‌ అభిమానులకు తీవ్ర ఆగ్రహావేశాలను కలిగించింది. అప్ప‌టి వ‌ర‌కు త‌మ జ‌ట్టు గెలుస్తుంద‌ని బావించ‌న వారంతా ఒక్క‌సారిగా షాక్ తిన్నారు. షార్జా స్టేడియంలో రచ్చరచ్చ చేశారు. తొలుత కుర్చీల‌ను విర‌గొట్టి వాటి.. ముక్క‌ల‌ను గాల్లోకి ఎగ‌రేశారు. అక్క‌డితో ఆగ‌కుండా పాక్‌ అభిమానులపై దాడులు చేశారు. ప్రతిగా పాక్ ప్యాన్స్ కూడా దాడికి దిగడంతో అక్క‌డ పెద్ద గ‌లాటానే చోటు చేసుకుంది. ఒకరిపై ఒకరు కుర్చీలు విసుకోవ‌డంతో పాటు పిడిగుద్దులు గుద్దుకున్నారు. అప్ర‌మ‌త్త‌మైన గ్రౌండ్‌స్టాఫ్‌, స్టేడియం భ‌ద్ర‌తా సిబ్బంది జోక్యం చేసుకుని ప‌రిస్థితిని అదుపులోకి తెచ్చి వారిని మైద‌నాం నుంచి బ‌య‌ట‌కు పంపించి వేశారు. కాగా.. గొడ‌వ‌కు సంబంధించిన దృశ్యాలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి.

Next Story
Share it