భార‌త్‌ సూపర్‌ విక్టరీ.. అభిమానుల ట్రోల్స్‌ వైరల్‌

Fans Hilarious memes and trolls after India super Victory.శ్రీలంక పై భార‌త జ‌ట్టు రెండో వ‌న్డేలో అద్భుత విజ‌యాన్ని

By తోట‌ వంశీ కుమార్‌  Published on  21 July 2021 11:24 AM IST
భార‌త్‌ సూపర్‌ విక్టరీ.. అభిమానుల ట్రోల్స్‌ వైరల్‌

శ్రీలంక పై భార‌త జ‌ట్టు రెండో వ‌న్డేలో అద్భుత విజ‌యాన్ని న‌మోదు చేసింది. ఒకానొక దశలో మ్యాచ్ చేజారిపోయినట్లు కనిపించినా.. ఫాస్ట్ బౌలర్ దీపక్ చాహర్ (69 నాటౌట్; 82 బంతుల్లో 7పోర్లు, 1సిక్స్‌) అసాధారణ ఇన్నింగ్స్ ఆడడంతో భార‌త జ‌ట్టు 3 వికెట్ల తేడాతో గెలుపొందింది. దాంతో పాటు మూడు వన్డేల సిరీస్‌ని ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే 2-0తో భారత్ చేజిక్కించుకుంది. ఇక నామాత్రమమైన మూడో వన్డే శుక్రవారం మధ్యాహ్నం కొలంబో వేదికగానే జరగనుంది.

ఇదిలా ఉంటే.. భార‌త విక్ట‌రీ అనంత‌రం అభిమానులు, మీమ్స్‌, ట్రోల్స్‌తో సోష‌ల్ మీడియాలో మోత మోగిస్తున్నారు. ముఖ్యంగా దీపక్‌ చహర్‌, భువనేశ్వర్‌ల ఇన్నింగ్స్‌, లంక ఓటమి, అర్జున ర‌ణ‌తుంగ వెట‌కార‌పు వ్యాఖ్య‌ల‌పై తెగ ట్రోల్స్ చేస్తున్నారు. భారత- బి జట్టు చేతిలో శ్రీలంక ఓడిపోవడమేంటి..? అంటూ నెటిజన్లు పరోక్షంగా అర్జున రణతుంగపై సోషల్ మీడియాలో సెటైర్లు పేలుస్తున్నారు. జట్టు-బిదే కావచ్చు.. కానీ.. చీఫ్ కోచ్‌గా ఎ+ గ్రేడ్‌‌ రాహుల్ ద్రవిడ్ ఉన్నాడంటూ నెటిజన్లు గుర్తు చేస్తున్నారు. రెండో వన్డేలో బౌలర్‌(దీపక్ ‌)ని నిలువరించలేక మ్యాచ్‌ని చేజార్చుకున్న శ్రీలంక టీమ్‌ ఏ గ్రేడ్ జట్టు అంటూ అభిమానులు ప్రశ్నిస్తున్నారు.

శ్రీలంక టూర్‌కి వెళ్లిన భారత్ జట్టుపై అర్జున రణతుంగ ఇటీవల వెటకారపు వ్యాఖ్యలు చేశాడు. టూర్‌కి భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారత్-బి జట్టుని పంపిందని ఎద్దేవా చేసిన రణతుంగ.. ఇలాంటి జట్టుతో ఆడటం శ్రీలంక టీమ్‌కి అవమానకరమని విమర్శించాడు. ఈ నేప‌థ్యంలోనే అభిమానులు ట్రోలింగ్ చేస్తున్నారు. తొలి వన్డే తర్వాత కూడా అర్జున రణతుంగపై ట్రోల్స్ నడిచాయి.

ఇక ఈమ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక 50 ఓవర్లలో 9 వికెట్లకు 275 పరుగులు చేసింది. అసలంక (65; 6 ఫోర్లు), అవిష్క ఫెర్నాండో (50; 4 ఫోర్లు, 1 సిక్స్‌) అర్ధ శతకాలతో రాణించారు. చివర్లో కరుణరత్నే (33 బంతుల్లో 44 నాటౌట్‌; 5 ఫోర్లు) మరోసారి ధాటిగా ఆడాడు. భారత బౌలర్లలో చహల్‌ (3/50), భువనేశ్వర్‌ (3/54), దీపక్‌ చహర్‌ (2/53) ప్రత్యర్థిని కట్టడి చేయడంలో తమ వంతు పాత్ర పోషించారు. ఛేదనలో భారత్‌ 49.1 ఓవర్లలో 7 వికెట్లు నష్టపోయి 277 పరుగులు చేసి నెగ్గింది. 'ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌' దీపక్‌ చహర్‌ (82 బంతుల్లో 69 నాటౌట్‌; 7 ఫోర్లు, 1 సిక్స్‌) సూపర్‌ ఇన్నింగ్స్‌ ఆడాడు. సూర్యకుమార్‌ యాదవ్‌ (44 బంతుల్లో 53; 6 ఫోర్లు) అర్ధ సెంచరీతో రాణించాడు. చివరిదైన మూడో వన్డే ఈనెల 23న జరుగుతుంది.

Next Story