Video : బాబర్-రిజ్వాన్ జ‌ట్టులో లేకపోవడంపై ప్రశ్న.. PAK క్రికెటర్ షాకింగ్‌ సమాధానం..!

పాకిస్థాన్ క్రికెట్ జట్టులో మార్పులు చోటుచేసుకున్నాయి. కెప్టెన్ బాబర్ ఆజం, వికెట్ కీపర్ మహ్మద్ రిజ్వాన్‌తో సహా కొంతమంది సీనియర్ ఆటగాళ్లకు జట్టు మేనేజ్‌మెంట్ విశ్రాంతినిచ్చింది.

By Medi Samrat
Published on : 4 Sept 2025 11:02 AM IST

Video : బాబర్-రిజ్వాన్ జ‌ట్టులో లేకపోవడంపై ప్రశ్న.. PAK క్రికెటర్ షాకింగ్‌ సమాధానం..!

పాకిస్థాన్ క్రికెట్ జట్టులో మార్పులు చోటుచేసుకున్నాయి. కెప్టెన్ బాబర్ ఆజం, వికెట్ కీపర్ మహ్మద్ రిజ్వాన్‌తో సహా కొంతమంది సీనియర్ ఆటగాళ్లకు జట్టు మేనేజ్‌మెంట్ విశ్రాంతినిచ్చింది. పాకిస్థాన్ జట్టు ప్రస్తుతం ట్రై-సిరీస్ ఆడుతోంది, ఇందులో ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 18 పరుగుల తేడాతో ఓడిపోయిన తర్వాత.. బాబర్, రిజ్వాన్‌లను జట్టు కోల్పోయింద‌ని మీరు భావిస్తున్నారా అని మీడియా ప్రశ్నించింది. దీనికి పాకిస్థాన్ ఆల్ రౌండర్ ఫహీమ్ అష్రఫ్ చెప్పిన సమాధానం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.

మీడియా ప్ర‌తినిధి ఫహీమ్ అష్రఫ్‌ను మీరు బాబర్, రిజ్వాన్‌లను మిస్ అవుతున్నారా? అని అడిగాడు. “చూడండి, మ్యాచ్ సమయంలో.. మేము మ్యాచ్‌ను మాత్రమే గుర్తుంచుకుంటాము.. మ్యాచ్‌లో ఎంత‌ స్కోర్ అవసరం.. ఎన్ని బంతులు అవసరం.. మేము మా కుటుంబ సభ్యులను కూడా గుర్తుంచుకోలేము.. మ్యాచ్‌లో పాకిస్థాన్‌ను ఎలా గెలిపించాలనే దానిపై మాత్రమే ఆలోచిస్తాం అంటూ బ‌దులిచ్చాడు.

ఫహీమ్ ప్రకటన సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది. బాబర్ ఆజం, మహ్మద్ రిజ్వాన్ ఇద్దరూ ట్రై-సిరీస్ జట్టులో లేరు. రాబోయే ఆసియా కప్‌లో వారికి జట్టులో చోటు లభించలేదు. ఇటీవలి టీ20 ఇంటర్నేషనల్‌లో వారి పేలవ ప్రదర్శనే కారణం. బాబర్ అజామ్, మహ్మద్ రిజ్వాన్ టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడి 8 నెలలకు పైగా అయింది. వీరిద్దరూ డిసెంబర్ 2024లో దక్షిణాఫ్రికాలో తమ చివరి టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడారు.

టీ20 ట్రై సిరీస్‌లో నేడు పాకిస్థాన్ జట్టు యూఏఈతో మ్యాచ్ ఆడనుంది. అంతకుముందు జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ జట్టు 31 పరుగుల తేడాతో విజయం సాధించింది.

Next Story