డుప్లెసిస్ త‌ల‌కు గాయం.. ఆస్ప‌త్రిలో చేరిక‌

Faf du plessis taken to hospital after injured his head while fielding.ఫీల్డింగ్ చేస్తూ ద‌క్షిణాఫ్రికా సీనియ‌ర్ ప్లేయ‌ర్

By తోట‌ వంశీ కుమార్‌  Published on  13 Jun 2021 5:12 AM GMT
డుప్లెసిస్ త‌ల‌కు గాయం.. ఆస్ప‌త్రిలో చేరిక‌

ఫీల్డింగ్ చేస్తూ ద‌క్షిణాఫ్రికా సీనియ‌ర్ ప్లేయ‌ర్ ఫాప్ డుప్లెసిస్ గాయ‌ప‌డ్డాడు. బౌండ‌రీ ద‌గ్గ‌ర బంతిని అందుకునే క్ర‌మంలో మ‌రో ఆట‌గాడిని గ‌ట్టిగా ఢీ కొట్ట‌డంతో స్మృహ కోల్పోయాడు. వెంట‌నే అత‌డిని ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ఈ ఘ‌ట‌న అబుదాబి షేక్ జాయెద్ స్టేడియంలో శ‌నివారం చోటు చేసుకుంది.

వివ‌రాల్లోకి వెళితే.. పాకిస్థాన్ సూప‌ర్ లీగ్ (పీఎస్ఎల్‌)లో భాగంగా శ‌నివారం క్వెట్టా గ్లాడియేటర్స్‌, పెషావర్‌ జల్మి జట్ల మధ్య మ్యాచ్ జ‌రిగింది. క్వెట్టా గ్లాడియేట‌ర్స్ టీమ్‌కు ఫాప్ డుప్లెసిస్ ప్రాతినిధ్యం వ‌హిస్తున్నాడు. లాంగాన్‌లో ఫీల్డింగ్ చేస్తున్న స‌మ‌యంలో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. పెషావ‌ర్ జాల్మీ ప్లేయ‌ర్ డేవిడ్ మిల్ల‌ర్ కొట్టిన షాట్ లాంగాన్ బౌండ‌రీ వైపు దూసుకెలుతుండ‌గా.. బంతిని ఆపేందుకు డుప్లెసిస్ డైవ్ చేశాడు. అదే స‌మ‌యంలో లాంగాఫ్ నుంచి మ‌రో ఆటగాడు మ‌హ‌మ్మ‌ద్ హ‌స్‌నెయిస్ ఢీ కొట్టాడు. హసనెయిన్‌ మోకాలి చిప్ప డుప్లెసిస్ త‌ల‌కు బ‌లంగా తాకింది.

డుప్లెసిస్ అక్క‌డే కుప్ప‌కూలాడు. దీంతో అందరిలో టెన్షన్‌ నెలకొంది. వెంట‌నే అక్క‌డికి వ‌చ్చిన సిబ్బంది అత‌డిని ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. అక్క‌డ అత‌నికి వివిధ స్కాన్లు నిర్వ‌హించారు. దీంతో డుప్లెసిస్ మిగ‌తా మ్యాచ్ ఆడ‌లేదు. ఇక ఈ మ్యాచ్‌లో క్వెట్టా గ్లాడియేట‌ర్స్ 198 ప‌రుగుల టార్గెట్‌ను ఛేదించ‌లేక 61 ప‌రుగుల తేడాతో ఓడిపోయింది. కాగా.. డుప్లెసిస్ ప్ర‌స్తుత ప‌రిస్థితిపై స‌మాచారం తెలియాల్సి ఉంది.

Next Story
Share it