ఆ ప్లేయర్ జట్టులో ఉండకూడదు.. లైవ్‌లో విరుచుకుపడ్డ బీసీసీఐ మాజీ చైర్మన్
Ex-BCCI selector destroys Manish Pandey on live TV. ఎట్టకేలకు ఐపీఎల్ 2023లో ఢిల్లీ క్యాపిటల్స్ తొలి విజయాన్ని రుచి చూసింది.
By Medi Samrat Published on 21 April 2023 3:06 PM ISTEx-BCCI selector destroys Manish Pandey on live TV
ఎట్టకేలకు ఐపీఎల్ 2023లో ఢిల్లీ క్యాపిటల్స్ తొలి విజయాన్ని రుచి చూసింది. గురువారం సొంత మైదానం అరుణ్ జైట్లీ స్టేడియంలో కోల్‌కతా నైట్ రైడర్స్‌పై ఢిల్లీ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఢిల్లీ నిర్దేశించిన 128 పరుగుల లక్ష్యాన్ని మరో నాలుగు బంతులు మిగిలి ఉండగానే ఛేదించి విజయం సాధించింది. అయితే విజయం సాధించినా ఢిల్లీ బ్యాటింగ్ లోపమే తెరపైకి వచ్చింది. డేవిడ్ వార్నర్ ఔటైన తర్వాత ఢిల్లీ ఇన్నింగ్స్ తడబడడంతో సులువైన విజయం కష్టతరంగా మారింది. ఈ సందర్భంగా బీసీసీఐ మాజీ చైర్మన్ కృష్ణమాచారి శ్రీకాంత్ మనీష్ పాండేపై విరుచుకుపడ్డారు. మనీష్ పాండే గురించి అడిగిన ప్రశ్నకు సమాధానం ఇవ్వడానికి నిరాకరించడం సరైనదని శ్రీకాంత్ భావించాడు.
మనీష్ పాండే ఇప్పటి వరకు బ్యాట్స్‌మెన్‌గా నిరూపించుకోలేకపోయాడు ఎందుకు అని యాంకర్ శ్రీకాంత్‌ని అడిగాడు. దీనికి శ్రీకాంత్ బదులిస్తూ.. 'మనం మనీష్ పాండే గురించి ఎందుకు మాట్లాడుతున్నాం? నేను మాట్లాడదలచుకోలేదు. ఈ వ్యక్తి జట్టులో ఉండకూడదు. అక్షర్ పటేల్ గురించి మాట్లాడుకుందాం. అతను తన జీవితంలో అత్యుత్తమ ఫామ్‌లో ఉన్నాడు. అతను అగ్రస్థానంలో బ్యాటింగ్ చేయడానికి అర్హుడు అని సంచలన వ్యాఖ్యలు చేశాడు.
దీనికి యాంకర్.. 'సరే, మనీష్ పాండే గురించి మాట్లాడకూడదని చీకా చాలా స్పష్టంగా చెప్పాడని అనగా.. దీనికి శ్రీకాంత్ బదులిస్తూ. 'లేదు. వాటి గురించి నేను మాట్లాడదలచుకోలేదు. అతను ఈ జట్టులో ఉండకూడదు. నేను సెలక్టర్ల ఛైర్మన్‌గా ఉంటే.. అతను ఆడలేడు అని మరింత ఫైర్ అయ్యాడు.
పరిస్థితి అదుపు తప్పడం చూసిన సంజయ్ మంజ్రేకర్ జోక్యం చేసుకుని పాండే గురించి మాట్లాడాడు. ఐపీఎల్‌లో సెంచరీ చేసిన తొలి భారతీయ బ్యాట్స్‌మెన్‌గా 33 ఏళ్ల మనీష్ పాండే నిలిచాడని గత రికార్డ్‌ను గుర్తుచేశాడు. ఇదిలావుంటే.. మనీష్ పాండే గత కొంతకాలంగా ఆటకు న్యాయం చేయడం కనిపించలేదు. అతను ఐపీఎల్‌లో ఒకే ఫ్రాంచైజీకి ప్రాతినిథ్యం మహించలేరపోయాడు. ఇప్పటివరకు మనీష్ పాండే ఏడు వేర్వేరు ఫ్రాంచైజీలకు ఆడటం విశేషం.