పింక్ బాల్ టెస్టు.. టాస్ గెలిచిన ఇంగ్లాండ్‌.. బ్యాటింగ్

England won the toss and elected to bat in third test.ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్‌ స్టేడియంలో భారత్‌, ఇంగ్లాండ్‌ మధ్య మ‌రో ఆస‌క్తిక‌ర పోరుకు రంగం సిద్ద‌మైంది

By తోట‌ వంశీ కుమార్‌  Published on  24 Feb 2021 2:39 PM IST
England won the toss and elected to bat in the third test

ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్‌ స్టేడియంలో భారత్‌, ఇంగ్లాండ్‌ మధ్య మ‌రో ఆస‌క్తిక‌ర పోరుకు రంగం సిద్ద‌మైంది. నాలుగు టెస్టుల సిరీస్‌లో భాగంగా మొతెరా వేదిక‌గా డే అండ్ నైట్ టెస్టు ఆడ‌నున్నాయి. టెస్టు ఛాంపియ‌న్ షిప్ ఫైన‌ల్‌కు చేరాలంటే ఈ మ్యాచ్ కీల‌కం కావ‌డంతో ఇరు జ‌ట్లు గెల‌వాల‌నే ప‌ట్టుద‌ల‌తో ఉండ‌డంతో.. మ్యాచ్ ఆస‌క్తిక‌రంగా ఉండ‌నుంది. టాస్ గెలిచిన ఇంగ్లాండ్ జ‌ట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. కొత్తగా నిర్మించిన ఈ స్టేడియంలో ఇదే తొలి అంతర్జాతీయ మ్యాచ్‌. ఈ స్టేడియం సామ‌ర్థ్యం లక్షా 10 వేలు. అయితే.. కరోనా కారణంగా సగం మందికే అనుమతి ఉంది. ఫ్లడ్‌లైట్లు లేకుండానే..అధునాతన టెక్నాలజీతో నిర్మించిన మొతెరా స్టేడియంలో ఫ్లడ్‌లైట్లకు బదులు స్టేడియంపై భాగం చుట్టూతా ఎల్‌ఈడీ లైట్లు అమర్చారు.

భార‌త జ‌ట్టు : రోహిత్ శర్మ, శుభ్ మన్‌ గిల్, చటేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ (కెప్టెన్), అజింక్య రహానే, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, అక్సర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, ఇషాంత్ శర్మ, బుమ్రా.

ఇంగ్లాండ్ జట్టు: డొమినిక్ సిబ్లీ, జాక్ క్రాలే, జానీ బెయిర్‌స్టో, జో రూట్ (కెప్టెన్), బెన్ స్టోక్స్, ఆలీ పోప్, బెన్ ఫోక్స్ (వికెట్ కీపర్), జోఫ్రా ఆర్చర్, జాక్ లీచ్, స్టువర్ట్ బ్రాడ్, జేమ్స్ ఆండర్సన్.


ప్రారంభించిన రాష్ట్ర‌ప‌తి..

అంత‌క‌ముందు రాష్ట్ర‌ప‌తి రామ్‌నాథ్ కోవింద్ అతిపెద్ద స్టేడియమైన మొతెరాను ప్రారంభించారు. ఈ కార్య‌క్ర‌మంలో కేంద్ర హోమ్‌శాఖ మంత్రి అమిత్ షా, క్రీడల శాఖ మంత్రి కిర‌ణ్ రిజిజు, గుజ‌రాత్ డిప్యూటీ సీఎం నితిన్ ప‌టేల్ పాల్గొన్నారు. ఈ కొత్త స్టేడియానికి న‌రేంద్ర మోదీ స్టేడియం అని పేరు పెట్ట‌డం పెట్టారు. అహ్మ‌దాబాద్‌లోని ఈ స్టేడియాన్ని పున‌రుద్ధ‌రించిన విష‌యం తెలిసిందే.



Next Story