సెమీస్‌కు ముందు ఇంగ్లాండ్‌కు భారీ షాక్
England Opener Jason Roy Ruled Out Of T20 World Cup.టీ20 ప్రపంచకప్ 2021 టోర్నీలో ఇంగ్లాండ్ జట్టు అద్భుత ఆటతీరుతో
By తోట వంశీ కుమార్ Published on 9 Nov 2021 12:24 PM ISTటీ20 ప్రపంచకప్ 2021 టోర్నీలో ఇంగ్లాండ్ జట్టు అద్భుత ఆటతీరుతో సెమీస్‌కు దూసుకువెళ్లిన సంగతి తెలిసిందే. అయితే.. కీలకమైన సెమీస్ మ్యాచ్‌కు ముందు ఆ జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు విధ్వంసకర ఓపెనర్ జేసన్ రాయ్ గాయంతో టోర్నీ నుంచి తప్పుకున్నాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన చివరి మ్యాచ్‌లో బ్యాటింగ్ చేస్తూ.. గాయపడడంతో మ్యాచ్ మధ్యలోనే రిటైర్డ్ హర్ట్ గా వెనుదిరిగాడు. ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ ఓడినప్పటికి రన్‌రేట్ ఆధారంగా సెమీపైనల్ చేరింది. మ్యాచ్ అనంతరం వైద్యులు రాయ్ గాయాన్ని పరిశీలించారు. విశ్రాంతి అవసరం అని సూచించడడంతో అతడు మిగతా టోర్నీ నుంచి తప్పుకున్నాడు. ఈ విషయాన్ని ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) ఓ ప్రకటనలో వెల్లడించింది. ఈ టోర్నీలో 5 మ్యాచ్‌లు ఆడిన రాయ్ 123 పరుగులు చేశాడు.
'ఇది నిజంగా చాలా భాదాకరమైన విషయం. కానీ మా జట్టును సపోర్ట్ చేయడానికి ఇక్కడే ఉంటాను. మేము కచ్చితంగా ట్రోఫీని సాధిస్తాము. ఈ టోర్నమెంట్‌లో నా ప్రయాణం ఎంతో అద్బుతమైనది. గాయం నుంచి తొందరగా కోలుకోని కరీబియన్ టూర్‌కు సిద్దంగా ఉంటాను' అని రాయ్ తెలిపాడు.
Thank you, @JasonRoy20 👏
— England Cricket (@englandcricket) November 8, 2021
Welcome, Vincey 👋 #T20WorldCup #EnglandCricket pic.twitter.com/3kVNdrwdUK
ఇక రాయ్ స్థానంలో జేమ్స్ విన్సీని ఇంగ్లాండ్ సెలక్టర్లు జట్టులోకి తీసుకున్నారు. అయితే.. బట్లర్ కలిసి అతడు ఓపెనింగ్ చేస్తాడా..? లేదా అన్నది తెలియాల్సి ఉంది. బట్లర్‌తో కలిసి మోయిన్ అలీ ఓపెనింగ్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. విన్సీని తుది జట్టులో తీసుకుంటారో లేదో చూడాలీ. కాగా.. రేపు (నవంబర్ 10) ఇంగ్లాండ్ జట్టు సెమీస్‌లో న్యూజిలాండ్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించిన జట్టు నేరుగా ఫైనల్‌కు వెళ్లనుంది.