భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య టీ20 సిరీస్ నువ్వా-నేనా అన్నట్లుగా సాగుతున్న సంగతి తెలిసిందే. నాలుగు టీ20 మ్యాచ్ లు ముగియగా 2-2 తో సమానంగా ఉన్నాయి ఇరు జట్లు. ఇక 5వ టీ20 శనివారం(నేడు) జరగనుంది. ఈ మ్యాచ్ గెలిచిన జట్టుకే సిరీస్ దక్కనుంది. ఇక ఈ సిరీస్ లో స్లో ఓవర్ రేట్ విషయంలో కూడా ఇరు జట్లు పోటీ పడుతున్నాయి. రెండో టీ20లో టీమిండియాకు కూడా స్లో ఓవర్ రేట్ కారణంగా మ్యాచ్ ఫీజులో కోత పడిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఇంగ్లాండ్ జట్టు కూడా స్లో ఓవర్ రేట్ ఫైన్ ను ఎదుర్కోవాల్సి వస్తోంది. నాలుగో టీ20లో ఇంగ్లాండ్ జట్టు నెమ్మదిగా బౌలింగ్ చేసింది.
నిర్దేశిత సమయంలో ఓవర్లు వేయనందుకు గాను ఐసీసీ మ్యాచ్ రిఫరీ జవగళ్ శ్రీనాథ్ ఇంగ్లాండ్ జట్టుకు జరిమానా విధించారు. ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో 20 శాతం కోత విధిస్తున్నట్టు ప్రకటించారు. ఇక ఇంగ్లాండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ స్లో ఓవర్ రేటును అంగీకరించడంతో ఎలాంటి విచారణ అవసరం పడలేదు. స్లో ఓవర్‌రేట్ కారణంగా ఆ జట్టుకు జరిమానా పడింది. నిర్ణీత సమయంలోపు ఒక ఓవర్ తక్కువగా వేయడంతో మ్యాచ్ రిఫరి జవగళ్ శ్రీనాథ్ ఇంగ్లాండ్ మ్యాచ్ ఫీజులో 20 శాతం కోత విధించాడు. ఆ జట్టు కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ తమ తప్పిదాన్ని అంగీకరించడంతో పాటు జరిమానాకు కూడా భరిస్తామని రిఫరికి తెలిపాడు.