ఓవర్ నైట్ స్కోర్ 300/6 తో రెండో రోజు ఆటను కొనసాగించిన భారత్ మరో 29 పరుగులు మాత్రమే జోడించి చివరి నాలుగు వికెట్లు కోల్పోయింది. రిషబ్‌పంత్ (58, 77 బంతుల్లో 7 పోర్లు, 3 సిక్సర్లు) అర్థశతకంతో రాణించడంతో తొలి ఇన్నింగ్స్‌లో టీమ్ఇండియా 329 పరుగులకు ఆలౌట్ అయింది. ఇంగ్లాండ్ బౌలర్లలో మొయిన్ అలీ 4, ఒలి స్టోన్ 3, జాక్ లీచ్ 2, జో రూట్ ఒక వికెట్ పడగొట్టారు. భారత బ్యాట్స్‌మెన్లలో రోహిత్ శర్మ 161 పరుగులు సాధించగా.. 67 పరుగులతో రహానే రాణించాడు.
ఆదివారం ఆట ప్రారంభించిన తొలి ఓవర్‌లోనే భారత్ రెండు వికెట్లు కోల్పోయింది. మోయిన్ అలీ వేసిన ఈ ఓవర్‌లో అక్షర్ పటేల్(5) స్టంపౌట్ కాగా.. ఇషాంత్ శర్మ(0) రోరీ బర్న్స్ చేతికి చిక్కాడు. ఓ వైపు వికెట్లు పడుతుండగా.. పంత్ మాత్రం ధాటిగా బ్యాటింగ్ చేస్తూ అర్థశతకాన్ని(58 నాటౌట్) సాధించాడు. మరో ఎండ్‌లో ఉన్న కుల్దీప్ యాదవ్(0), సిరాజ్(4) లను ఒలీ స్టోన్ ఒకే ఓవర్ ఔట్ చేయడంతో 329 పరుగుల వద్ద భారత ఇన్నింగ్స్ ముగిసింది. పిచ్ అనూహ్యంగా స్పందిస్తుండడంతో.. బారత బౌలర్లును ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్లు ఎలా ఎదుర్కొంటారో చూడాలి మరీ.