లీడ్ వేదికగా జరుగుతున్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ 432 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఓవర్ నైట్ స్కోర్ 423/8 పరుగులతో మూడో రోజు ఆట ప్రారంభించిన ఇంగ్లాండ్ మరో 9 పరుగులు మాత్రమే జోడించి చివరి రెండు వికెట్లు కోల్పోయింది. రాబిన్సన్‌ను బుమ్రా బౌల్డ్ చేయడంతో 432 పరుగులకు ఇంగ్లాండ్ ఆలౌట్ అయ్యింది. భారత బౌలర్లలో మహ్మద్ షమి నాలుగు వికెట్లు పడగొట్టగా.. సిరాజ్, జడేజా, బుమ్రా తలా రెండు వికెట్లు పడగొట్టారు.
ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్లలో జోరూట్ 121, మలాన్ 70, హమీద్ 68, బర్న్స్ 61 పరుగులతో రాణించారు. కాగా.. భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 78 పరుగులకే ఆలౌట్ అయిన సంగతి తెలిసిందే. దీంతో ఇంగ్లాండ్‌కు 354 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. కాగా.. ఈ మ్యాచ్ లో ఇంకా చాలా సమయం ఉండడంతో ఫలితం రావడం ఖాయంగా కనిపిస్తుంది. రెండో ఇన్నింగ్స్‌లో భారత బాట్స్‌మెన్లు ఎలా రాణిస్తారు అన్నదానిపైనే మ్యాచ్ ఫలితం ఆధారపడి ఉంది. ఈ మ్యాచ్‌లో టీమ్ఇండియా ఓటమి నుంచి గట్టేక్కాలంటే అసాధారణంగా పోరాడాల్సిందే.