పాకిస్థాన్ లీగ్ నాకొద్దన్న జింబాబ్వే ఆటగాడు.. పీసీబీ ఏమంటోందంటే.?

జింబాబ్వే స్టార్ పేసర్ బ్లెస్సింగ్ ముజరబానీ పాకిస్థాన్ సూపర్ లీగ్ ఒప్పందాన్ని కాదని ఐపీఎల్‌లో ఆడేందుకు మొగ్గు చూపడంతో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) తీవ్ర ఆగ్రహంతో ఊగిపోతోంది.

By -  Medi Samrat
Published on : 14 March 2026 3:30 PM IST

పాకిస్థాన్ లీగ్ నాకొద్దన్న జింబాబ్వే ఆటగాడు.. పీసీబీ ఏమంటోందంటే.?

జింబాబ్వే స్టార్ పేసర్ బ్లెస్సింగ్ ముజరబానీ పాకిస్థాన్ సూపర్ లీగ్ ఒప్పందాన్ని కాదని ఐపీఎల్‌లో ఆడేందుకు మొగ్గు చూపడంతో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) తీవ్ర ఆగ్రహంతో ఊగిపోతోంది. మార్చి 26 నుంచి ప్రారంభం కానున్న పీఎస్ఎల్ సీజన్ 11 కోసం ఇస్లామాబాద్ యునైటెడ్ జట్టు ముజరబానీని రూ.1.1 కోట్లకు (పాకిస్థాన్ కరెన్సీ) కొనుగోలు చేసింది. అయితే ఇటు ఐపీఎల్ లో కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) నుంచి అతనికి పిలుపు వచ్చింది. బంగ్లాదేశ్ బౌలర్ ముస్తాఫిజుర్ రెహమాన్ స్థానంలో కేకేఆర్ ముజరబానీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో పీఎస్ఎల్ ఒప్పందాన్ని రద్దు చేసుకున్నాడు.

గతేడాది కూడా దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్ కార్బిన్ బాష్, పెషావర్ జల్మీకి ఎంపికైన తర్వాత ముంబై ఇండియన్స్‌కు వచ్చేశాడు. దీంతో పీఎస్ఎల్ నిర్వాహకులు అతనిపై ఏడాది పాటు నిషేధం విధించారు. ఇటీవల ముగిసిన టీ20 ప్రపంచకప్ 2026లో ముజరబానీ అద్భుతంగా రాణించాడు. టోర్నీలో 13 వికెట్లు పడగొట్టి, అత్యధిక వికెట్లు తీసిన మూడో బౌలర్‌గా నిలిచాడు. అతని ప్రదర్శనతోనే జింబాబ్వే జట్టు సూపర్-8 దశకు చేరుకోగలిగింది.

Next Story