కోచ్ ద్రావిడ్ రిటైర్ అవ్వ‌మ‌న్నాడు : సాహా

Dravid suggested that I think about retirement says Saha.మార్చి 4 నుంచి శ్రీలంక‌తో ప్రారంభం కానున్న టెస్టు సిరీస్‌కు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  20 Feb 2022 10:56 AM IST
కోచ్ ద్రావిడ్ రిటైర్ అవ్వ‌మ‌న్నాడు : సాహా

మార్చి 4 నుంచి శ్రీలంక‌తో ప్రారంభం కానున్న టెస్టు సిరీస్‌కు శ‌నివారం భార‌త జ‌ట్టును సెల‌క్ట‌ర్లు ఎంపిక చేసిన సంగ‌తి తెలిసిందే. కాగా.. ఈ సిరీస్‌కు సీనియ‌ర్ ఆట‌గాళ్లు అజింక్య ర‌హానే, పుజారా, ఇషాంత్ శ‌ర్మ‌తో పాటు వృద్ధిమాన్ సాహాను ప‌క్క‌న‌బెట్టేశారు. ఈ క్ర‌మంలో జ‌ట్టు యాజ‌మాన్యంపై సీనియ‌ర్ వికెట్ కీప‌ర్ వృద్ధిమాన్ సాహ తీవ్ర అసంతృప్తిని వ్య‌క్తం చేయ‌డంతో పాటు ఆస‌క్తిక‌ర విష‌యాల‌ను బ‌య‌ట‌పెట్టాడు. కోచ్ రాహుల్ ద్ర‌విడ్‌, బీసీసీఐ అధ్య‌క్షుడు సౌర‌వ్ గంగూలీ త‌న‌తో ఏమీ చెప్పారో వెల్ల‌డించాడు.

త‌న‌ను ఇక‌పై జ‌ట్టు ఎంపికలో ప‌రిగ‌ణ‌లోకి తీసుకోబోమ‌ని జ‌ట్టు యాజ‌మాన్యం ముందే చెప్పిన‌ట్లు సాహా తెలిపాడు. అంతేకాకుండా రిటైర్ గురించి ఆలోచించ‌మ‌ని కోచ్ రాహుల్‌ ద్ర‌విడ్ స‌ల‌హా ఇచ్చిన‌ట్లు చెప్పాడు. కాన్పూర్ వేదిక‌గా గతేడాది న‌వంబ‌ర్‌లో కివీస్‌తో జ‌రిగిన తొలి టెస్టులో గాయంతో బాధ‌ప‌డుతూనే 61 ప‌రుగుల‌తో అజేయంగా నిలిచాను. అప్పుడు సౌర‌వ్ గంగూలీ నాకు వాట్సాప్ ద్వారా శుభాకాంక్ష‌లు తెలియ‌జేశాడు. తాను బీసీసీఐ అధ్యక్షుడిగా ఉన్నంత కాలం దేని గురించి ఆలోచించాల్సిన ప‌ని లేద‌ని గంగూలీ చెప్పిన‌ట్లు సాహ తెలిపాడు. అప్పుడు త‌న‌లో ఆత్మ విశ్వాసం చాలా పెరిగింద‌ని చెప్పుకొచ్చాడు. అయితే.. ఇంత వేగంగా ప‌రిస్థితులు ఎలా మారిపోయావో త‌న‌కు అర్థం కావ‌డం లేద‌న్నాడు.

జ‌ర్న‌లిస్టుపై అస‌హ‌నం

ఓ జ‌ర్న‌లిస్టుపై సాహా అస‌హ‌నం వ్య‌క్తం చేశాడు. స‌ద‌రు జ‌ర్న‌లిస్టు ఇంట‌ర్వ్యూ కోసం త‌న‌ను బ‌ల‌వంతం చేసిన‌ట్లు తెలిపాడు. ఇందుకు సంబంధించిన వాట్సాప్ చాట్ హిస్ట‌రినీ స్ర్కీన్ షాట్ల‌ను సోష‌ల్ మీడియాలో పోస్టు చేశాడు. టీమ్ఇండియాకు నేను చేసిన సేవ‌ల‌కు గాను ఓ జ‌ర్న‌లిస్టు నుంచి ఎదురైన అనుభ‌వం ఇది. జ‌ర్న‌లిజం ఇంత దిగ‌జారిపోయింది అని సాహా రాసుకొచ్చాడు.

Next Story