ఆఖరి బంతికి హైడ్రామా.. గెలిచామని ఆటగాళ్ల సంబరాలు.. నోబాల్ అని రమ్మన్న అంఫైర్.. వీడియో వైరల్
Dramatic no ball temporarily ruins hampshire players celebration.క్రికెట్ చరిత్రలో కనీవిని ఎగురని హైడ్రామా శనివారం
By తోట వంశీ కుమార్ Published on 17 July 2022 3:15 PM ISTక్రికెట్ చరిత్రలో కనీవిని ఎగురని హైడ్రామా శనివారం బర్మింగ్‌హామ్ వేదికగా జరిగిన టీ20 బ్లాస్ట్ 20222 సీజన్ ఫైనల్ మ్యాచ్‌లో చోటు చేసుకుంది. ఆఖరి బంతికి నాలుగు పరుగులు చేయాల్సి ఉండగా బ్యాటర్ బౌల్డ్ కావడంతో ఫీల్డింగ్ జట్టు గెలిచామని సంబరాల్లో మునిపోయింది. అయితే.. థర్డ్ అంఫైర్ వారికి షాకిచ్చాడు. ఆ బంతిని నోబాల్ అంటూ చెప్పడంతో ఫీల్డ్ అంఫైర్ నోబాల్ సిగ్నల్ ఇస్తూ.. సంబరాలు చేసుకుంటున్న ఫీల్డింగ్ జట్టును రమ్మంటూ సైగలు చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
అసలు మ్యాటర్‌లోకి వెళితే.. టీ20 బ్లాస్ట్ టైటిల్ కోసం శనివారం హాంప్‌షైర్, లాంక్‌షైర్ జట్లు ఫైనల్ మ్యాచ్‌లో తలపడ్డాయి. తొలుత బ్యాటింగ్ చేసిన హాంప్‌షైర్ నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది. అనంతరం 153 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లాంక్‌షైర్ విజయానికి చివరి ఓవర్‌లో 11 పరగులు అవసరం అయ్యాయి. అంతకముందు 19వ ఓవర్‌లో 12 పరుగులు చేసి బ్యాటర్లు ఊపులో ఉండడంతో లాంక్‌షైర్ దే విజయం అని చాలా మంది బావించారు. అయితే.. హాంప్‌షైర్ బౌలర్ నాథన్ ఎల్లిస్ చివరి ఓవర్ తొలి మూడు బంతులకు కేవలం నాలుగు పరుగులు ఇచ్చాడు.
A no ball. A no ball.
— Vitality Blast (@VitalityBlast) July 16, 2022
The utter, utter drama of #Blast22.
What a match.#FinalsDay pic.twitter.com/cRYkesYjYr
నాలుగో బంతికి లూక్ వుడ్ రనౌట్ కాగా.. ఐదో బంతికి రెండు పరుగులు వచ్చాయి. దీంతో ఆఖరి బంతికి ఐదు పరుగులు కావాల్సి ఉంది. ఫోర్ కొడితే మ్యాచ్ టైగా ముగుస్తుంది. రూల్స్ ప్రకారం లాంక్‌షైర్ విజయం సాధిస్తుంది. అయితే.. బౌలర్ ఎల్లిస్ బ్యాటర్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు. దీంతో హాంప్‌షైర్ ఆటగాళ్లు సంబరాల్లో మునిగిపోయారు. మైదానం బాణా సంచా వెలుగులతో నిండిపోయింది. అయితే.. అది నోబాల్ అని సంబరాలు అని.. ఇక సంబరాలు చాలు వెనక్కి వచ్చేయండి అని అంపైర్ ఆటగాళ్లను వెనక్కి పిలిచాడు. ఇప్పుడు లాంక్‌షైర్ విజయానికి నాలుగు అవసరం, టై కావాలంటే మూడు పరుగులు కావాలి. అయితే.. రెండు పరుగులు మాత్రమే వచ్చాయి. ఒక్క పరుగు తేడాతో హాంప్‌షైర్ విజయం సాధించి టైటిల్ గెలిచింది.
ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై అభిమానులు తమదైన శైలిలో కామెంట్లు పెడుతున్నారు.