టెస్ట్ క్రికెట్‌లో ఎర్ర బంతే ఎందుకు?
మొదటి నుంచి క్రికెట్‌లో రెడ్ బాల్‌నే ఉపయోగిస్తున్నారు. దీన్ని కార్క్, లెదర్ ముక్కలు, తాడుతో తయారుచేస్తారు.
By అంజి
టెస్ట్ క్రికెట్‌లో ఎర్ర బంతే ఎందుకు?
మొదటి నుంచి క్రికెట్‌లో రెడ్ బాల్‌నే ఉపయోగిస్తున్నారు. దీన్ని కార్క్, లెదర్ ముక్కలు, తాడుతో తయారుచేస్తారు. రెండు లెదర్ ముక్కల మధ్య కార్క్‌ను ఉంచి ఎలాంటి మెషీన్ సాయం లేకుండా.. నేరుగా చేతితోనే 60 నుంచి 80 కుట్లు వేసి తయారు చేస్తారు. బాల్ రౌండ్ షేప్ రావడానికి మాత్రం మెషీన్ వాడతారు. అనంతరం మైనం పొర పూసి, పాలిష్ చేసి మెరిసేలా చేస్తారు. బాల్ 2.8-2, 2.86 అంగుళాల వ్యాసం, 8.81-9 అంగుళాల చుట్టుకొలత, 155.9 -163 గ్రాముల బరువు ఉంటుంది. అయితే వన్డే, టీ20లు వచ్చాక వైట్ బాల్ వాడకం స్టార్ట్ చేశారు. ఎందుకంటే రాత్రి వేళ లైట్ వెలుగుల్లో వైట్ బాల్ బాగా కనిపిస్తుంది.
కానీ, త్వరగా పాడవుతుంది. కానీ, రెడ్ బాల్ అలా కాదు. టెస్ట్ అంటే దీర్ఘకాలం పాటు కొనసాగే ఆట. అందుకే మన్నికగా ఉండాల్సిన అవసరం ఉంది. అందువల్లే వైట్ బాల్ వచ్చినా.. టెస్ట్ క్రికెట్‌లో రెడ్ బాల్‌నే వాడుతున్నారు. టెస్ట్ క్రికెట్‌లో వాడే రెడ్ బాల్‌ను 80 ఓవర్లకు ఓసారి మాత్రమే మారుస్తారు. కానీ, లైట్స్ కింద రెడ్ బాల్ సరిగ్గా కనిపించదు. అందుకే డే / నైట్ టెస్టుల కోసం పింక్ బాల్‌ను పరిచయం చేశారు. రెడ్ బాల్‌పై తెలుపుదారం ఉంటే.. పింక్ బాల్‌కు మాత్రం నలుపు దారం వాడతారు. పింక్ బాల్ డ్యూ (మంచు) వచ్చినా గ్రిప్ కోల్పోకుండా ఉంటుంది.