ఫిడే ఉమెన్ చెస్ వరల్డ్ కప్ విజేతగా దివ్య దేశ్‌ముఖ్

ఫిడే ఉమెన్ చెస్ వరల్డ్ కప్ విజేతగా గెలిచి దివ్య దేశ్‌ముఖ్ రికార్డు సృష్టించారు

By Knakam Karthik
Published on : 28 July 2025 4:45 PM IST

Sports News, Fide Womens Chess World Cup, Divya DeshMukh, Koneru Hampi

ఫిడే ఉమెన్ చెస్ వరల్డ్ కప్ విజేతగా దివ్య దేశ్‌ముఖ్

ఫిడే ఉమెన్ చెస్ వరల్డ్ కప్ విజేతగా గెలిచి దివ్య దేశ్‌ముఖ్ రికార్డు సృష్టించారు. ఫైనల్‌లో మరో భారత గ్రాండ్ మాస్టర్ కోనేరు హంపిపై విక్టరీ సాధించిన దివ్య..న్యూ రికార్డు క్రియేట్ చేశారు. కాగా గత రెండు రోజుల్లో రెండు గేమ్స్ డ్రా గా ముగియగా.. టై బ్రేకర్ లో దివ్య గెలిచారు. దీంతో 88వ ఫిడే మహిళల చెస్ ప్రపంచకప్ లో గెలిచిన తొలి భారతీయురాలిగా దివ్య రికార్డు నెలకొల్పింది. మహారాష్ట్రకు చెందిన దివ్య దేశ్‌ముఖ్... బాల్యం నుంచి అనేక అంతర్జాతీయ టైటిల్స్ గెలుచుకున్నారు.

2023లో ఇంటర్నేషనల్ మాష్టర్ టైటిల్ ను, 2024లో అండర్-20 వరల్డ్ జూనియర్ గర్ల్స్ టైటిల్ నెగ్గింది. విజయం సాధించిన అనంతరం దివ్య ఎమోషనల్ అయ్యింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో దివ్య దేశ్‌ముఖ్ పేరు మారు మ్రోగిపోతోంది. ఇప్పటివరకు ఇంటర్నేషనల్ మాస్టర్ గా ఉన్న దివ్య ఈ విజయంతో గ్రాండ్ మాస్టర్ హోదా పొందింది. నేటి టైబ్రేకర్ పోరులో 75వ ఎత్తు అనంతరం కోనేరు హంపి ఓటమిని అంగీకరించింది.

Next Story