దంచికొట్టిన కాన్వే.. అరుదైన రికార్డు.. ఆసీస్ ముందు భారీ ల‌క్ష్యం

Devon Conway equals Babar Azam's big record. ఆస్ట్రేలియాతో న్యూజిలాండ్ జ‌ట్టు త‌ల‌ప‌డుతోంది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  22 Oct 2022 2:48 PM IST
దంచికొట్టిన కాన్వే.. అరుదైన రికార్డు.. ఆసీస్ ముందు భారీ ల‌క్ష్యం

ఆస్ట్రేలియా వేదిక‌గా జ‌రుగుతున్న టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2022 సీజ‌న్‌లో అస‌లు సిస‌లు అంకానికి నేడు తెర‌లేచింది. సూప‌ర్ 12 తొలి పోరులో అతిథ్య ఆస్ట్రేలియాతో న్యూజిలాండ్ జ‌ట్టు త‌ల‌ప‌డుతోంది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో మూడు వికెట్ల న‌ష్టానికి 200 ప‌రుగులు చేసింది. బ్యాట‌ర్ల‌లో ఓపెన‌ర్ డేవన్ కాన్వే(92 నాటౌట్; 58 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స‌ర్లు) అద్భుత ఇన్నింగ్స్ ఆడ‌గా.. మ‌రో ఓపెన‌ర్ ఫిన్‌ఆలెన్‌(42; 16 బంతుల్లో 5ఫోర్లు, 3 సిక్స‌ర్లు), నీష‌మ్‌(26; 13 బంతుల్లో 2 సిక్స‌ర్లు) రాణించ‌డంతో ఆసీస్ ముందు కివీస్ భారీ ల‌క్ష్యాన్ని ఉంచింది.

కాన్వే అరుదైన ఘ‌న‌త‌..

ఇక ఈ మ్యాచ్‌లో రాణించిన డేవన్ కాన్వే టీ20 క్రికెట్‌లో అరుదైన ఘ‌న‌త సాధించాడు. టీ20ల్లో అత్యంత వేగంగా 1000 ప‌రుగులు పూర్తి చేసిన బ్యాట‌ర్‌గా బాబ‌ర్ ఆజామ్‌తో క‌లిసి సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచాడు. 59 ప‌రుగుల వ‌ద్ద అత‌డు ఈ ఘ‌న‌త సాధించాడు. 26 ఇన్నింగ్స్‌ల్లోనే డేవన్ కాన్వే, బాబ‌ర్ ఆజామ్‌లు వెయ్యి ప‌రుగులు పూర్తి చేయ‌గా.. ఇంగ్లాండ్ స్టార్ డేవిడ్ మలాన్ కేవ‌లం 24 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ ఘ‌న‌త అందుకున్నాడు.

Next Story