ఢిల్లీని ఢీకొట్ట‌నున్న శాంస‌న్ సేన‌.. రికార్డులు ఎలా ఉన్నాయంటే..?

Delhi Capitals vs Rajasthan Royals match prediction.ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021 సెకండాఫ్‌లో మ్యాచ్‌లు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  25 Sep 2021 8:26 AM GMT
ఢిల్లీని ఢీకొట్ట‌నున్న శాంస‌న్ సేన‌.. రికార్డులు ఎలా ఉన్నాయంటే..?

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021 సెకండాఫ్‌లో మ్యాచ్‌లు అంచ‌నాల‌కు భిన్నంగా సాగుతున్నాయి. కాగా.. శ‌నివారం అభిమానులకు పండుగ‌. ఎందుకంటే నేడు రెండు మ్యాచ్‌లు జ‌ర‌గ‌నున్నాయి. తొలుత మధ్యాహ్నం ఢిల్లీ క్యాపిటల్స్‌తో రాజస్థాన్ రాయల్స్ తలపడనుండ‌గా.. రాత్రి స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్.. పంజాబ్ కింగ్స్‌ను ఢీ కొట్ట‌నుంది.

పంత్ సార‌థ్యంలోని ఢిల్లీ జ‌ట్టు సంజు శాంస‌న్ కెప్టెన్సీలోని రాజ‌స్థాన్ జ‌ట్టుతో మ‌ధ్యాహ్నాం 3.30గంట‌ల‌కు త‌ల‌ప‌నుంది. ఢిల్లీ ఇప్ప‌టి వ‌ర‌కు తొమ్మిది మ్యాచ్‌లు ఆడ‌గా 7 మ్యాచుల్లో విజ‌యం సాధించి 14 పాయింట్ల‌తో పాయింట్ల ప‌ట్టిక‌లో రెండో స్థానంలో కొన‌సాగుతుండ‌గా.. రాజ‌స్థాన్ 8 మ్యాచ్‌లు ఆడి 4 మ్యాచుల్లో విజ‌యం సాధించి 8 పాయింట్ల‌తో ఐదో స్థానంలో ఉంది. కాగా.. ఈ మ్యాచ్‌లో విజ‌యం సాధించాల‌ని ఇరుజ‌ట్లు ప‌ట్టుద‌ల‌గా ఉన్నాయి. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ గ‌నుక విజ‌యం సాధిస్తే.. 16 పాయింట్ల‌తో ప్లే బెర్తును క‌న్‌ఫాం చేసుకుంటుంది.

ఇదిలా ఉంటే.. ఐపీఎల్ చ‌రిత్ర‌లో ఇరు జ‌ట్లు ఇప్ప‌టి వ‌ర‌కు 23 మ్యాచ్‌ల్లో తలపడ్డాయి. రాజస్థాన్ 12 మ్యాచుల్లో విజ‌యం సాధించ‌గా.. ఢిల్లీ 11 మ్యాచుల్లో గెలుపొంది. ఇక యూఏఈలో తలపడిన రెండు సార్లు ఢిల్లీనే విజ‌యం వ‌రించ‌డం గ‌మ‌నార్హం. కాగా.. నేటి మ్యాచ్ షేక్ జాయెద్ క్రికెట్ స్టేడియంలో జ‌ర‌గ‌నుంది. యూఏఈలోని మిగిలిన మైదానాల‌తో పోలిస్తే.. ఇది చాలా పెద్ద గ్రౌండ్‌. ఇక్క‌డ తొలి ఇన్నింగ్స్‌లో 159 యావరేజ్‌ స్కోర్‌. ఈ గ్రౌండ్‌లో టాస్ గెలిచిన జట్లు 15 సార్లు విజయం సాధించగా.. ఓడిన జట్లు 9 సార్లు మాత్రమే గెలిచాయి.

Next Story