ఢిల్లీ క్యాపిటల్స్ కొత్త జెర్సీని చూశారా..?
Delhi Capitals unveil new jersey ahead of IPL 2022 season.ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 15వ సీజన్ మార్చి 26 నుంచి
By తోట వంశీ కుమార్
ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 15వ సీజన్ మార్చి 26 నుంచి ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే అన్ని ఫ్రాంచైజీలు ఇటీవల జరిగిన మెగా వేలంలో తమకు కావాల్సిన ఆటగాళ్లను దక్కించుకున్నాయి. టోర్నీలో విజేతగా నిలిచేందుకు ఇప్పటికే అన్ని జట్లకు సంబంధించిన ఆటగాళ్లు, కోచ్ వ్యూహాలు రచిస్తున్నారు. ఇక రిషబ్ పంత్ సారథ్యంలోని ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఈ సారి సరికొత్త జెర్సీతో బరిలోకి దిగనుంది. తమ జెర్సీని నేడు ఢిల్లీ క్యాపిటల్స్ సోషల్ మీడియా వేదికగా అధికారికంగా విడుదల చేసింది.
అరుణ్ జైట్లీ స్టేడియంలో ఈ కొత్త జెర్సీని అభిమానుల సమక్షంలో ఆవిష్కరించింది. ఎరుపు, నీలం కలగలిసిన రంగులో ఉన్న జెర్సీపై అంతర్లీనంగా పులి బొమ్మ ఉంది. 'ఐపీఎల్ సీజన్ కోసం ఎదురుచూస్తున్నాం. మా కొత్త జెర్సీలో ఆటగాళ్లను చూసేందుకు వేచి ఉండలేకపోతున్నాం. డీసీకి అభిమానుల మద్దతు ఎప్పుడూ ఉంటుంది. అందుకే మా ప్రయాణంలో వారిని భాగం చేసుకోవడం మా బాధ్యత' అని ఢిల్లీ క్యాపిటల్స్ తాత్కాలిక సీఈవో వినోద్ బిస్త్ అన్నారు.
🎥 | #NayiDilliKiNayiJersey ➡️ In all its glory 💙❤️#YehHaiNayiDilli #IPL2022 pic.twitter.com/D8vwyr4fdt
— Delhi Capitals (@DelhiCapitals) March 12, 2022
ఢిల్లీ నూతన జెర్సీపై అభిమానుల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. కొంతమంది బాగుందంటే.. మరికొంత మంది పాత జెర్సీనే చూడముచ్చటగా ఉందని అంటున్నారు. ఇక ఐపీఎల్ 15వ సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ తన తొలి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌తో మార్చి 27న తలపడనుంది.