కోహ్లీ కుమారైకు అత్యాచార బెదిరింపులు.. మహిళా కమిషన్ సీరియస్
DCW issues notice to Delhi Police over online threats to Virat Kohli's family.టీ20 ప్రపంచకప్‌లో టీమ్ఇండియా ఘోరంగా
By తోట వంశీ కుమార్ Published on 2 Nov 2021 3:16 PM ISTటీ20 ప్రపంచకప్‌లో టీమ్ఇండియా ఘోరంగా విఫలం కావడంతో ఇంటా బయట విమర్శలు ఎదుర్కొటోంది. అయితే.. కొందరు ఆటగాళ్ల కుటుంబ సభ్యులను ఇందులోకి లాగుతున్నారు. భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ నటి అనుష్క శర్మ గారాల పట్టి వామిక(9నెలల)ను అత్యాచారం చేస్తామని ఓ వ్యక్తి సోషల్ మీడియాలో బెదిరింపులకు పాల్పడిన సంగతి తెలిసిందే. దీనిపై ఢిల్లీ మహిళా కమిషన్ సీరియస్ అయ్యింది. ఈ బెదిరింపులను సుమోటా తీసుకుంది. దీనిపై ఢిల్లీ పోలీసులకు నోటీసులు జారీ చేసింది.
9 నెలల చిన్నారిని సోషల్‌మీడియాలో బెదిరించిన తీరు చాలా సిగ్గుచేటు అని మహిళా సంఘం ఛైర్‌పర్సన్ స్వాతి మలివాల్ అన్నారు. ఈ బెదిరింపులకు సంబంధించి ఎఫ్ఐఆర్ కాపీని, గుర్తించిన నిందితులు, వారిలో అరెస్టైన వారి వివరాలు కూడా అందించాలని డిప్యూటీ కమిషనర్‌ను కోరింది. ఈ కేసులో పోలీసులు తీసుకున్న చర్యలను వివరిస్తూ నవంబరు 8లోగా నివేదిక సమర్పించాలని ఆదేశించింది. నిందితులను అరెస్టు చేయకపోతే, దయచేసి నిందితులను అరెస్టు చేయడానికి పోలీసులు తీసుకున్న చర్యల వివరాలైనా అందించాలని కోరింది.
भारतीय क्रिकेट टीम के कप्तान @imVkohli और @AnushkaSharma की बेटी को ट्विटर पर बलात्कार की धमकी मिलने के मामले में दिल्ली महिला आयोग ने भेजा पुलिस को नोटिस।DCW अध्यक्ष @SwatiJaiHind ने बताया घटना को शर्मनाक, आरोपी की गिरफ्तारी की मांग pic.twitter.com/qUEWeLeyLx
— Delhi Commission for Women - DCW (@DCWDelhi) November 2, 2021
అసలేం జరిగిందంటే.. పాక్‌తో ఓటమి అనంతరం పలువురు షమీ మతాన్ని అడ్డుపెట్టుకుని కొన్ని విపరీత వ్యాఖ్యలు చేశారు. షమీ ముస్లిం కావడం వల్ల.. అతడు పాకిస్థాన్ గెలవాలని కోరుకున్నాడని.. అందుకనే దగ్గరుండి పాక్‌ను గెలిపించాడని సోషల్ మీడియాలో ట్రోలింగ్‌కు దిగారు. కాగా.. దీన్ని రాజకీయ నాయకులతో పాటు క్రీడాకారులు ఖండించారు. షమీకి మద్దుతుగా నిలబడిన సంగతి తెలిసిందే. కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా షమీకి మద్దుతుగా మాట్లాడుతూ.. ఈ వ్యాఖ్యలు చేస్తున్న వారిని అతడు వెన్నముకలేని వాళ్లుగా అభివర్ణించాడు.
దీంతో వారికి కోహ్లీ టార్గెట్‌గా మారాడు. అత్యంత జుగుప్సాకరమైన రీతిలో కోహ్లీ కూతురిని అత్యాచారం చేస్తామంటూ దుండగులు కామెంట్లు పెట్టారు.' కోహ్లీ, అనుష్క.. మీరు సిగ్గుతో తలదించుకోవాలి.. మీ కూతురు(వామిక) ఫొటోలను ఎప్పుడెప్పుడు చూపిస్తారా.. ఎప్పుడు తనను రేప్ చేస్తానా అని ఎదురు చేస్తున్నా..'అంటూ క్రిక్ క్రేజీ గర్ల్స్ అనే ట్విటర్ యూజర్ కామెంట్లు చేశాడు. సదరు యూజర్ చేసిన కామెంట్లపై నెటీజన్లు మండిపడుతున్నారు. అలాంటి వ్యాఖ్యలు చేసిన సదరు వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
ఈ వ్యాఖ్యలు చేసింది తొలుత పాకిస్థాన్ కు చెందిన వారని ప్రచారం సాగినా.. ఫ్యాక్ట్ చెకర్, ప్రఖ్యాత ఆల్ట్ న్యూస్ కో-ఫౌండరైన మొహ్మద్ జుబేర్ మాత్రం అతడిది హైదరాబాదే అని చెబుతున్నారు. క్రిక్ క్రేజీ గర్ల్స్, రమన్ హెయిస్ట్, పెళ్లికూతురుహిరయ్ అనే పేర్లు గల ట్విటర్ అకౌంట్లతో ట్రోలింగ్ కు పాల్పడుతోన్న వ్యక్తి ఒకడేనని.. ఆ మూడు అకౌంట్లకు డేటా యూజర్ ఐడీ ఒకటేనని, ఆ వ్యక్తి హైదరాబాద్ కు చెందినవాడేనని తేల్చేశాడు.