రెండో ఇన్నింగ్స్‌లో కుప్ప‌కూలిన టాప్ఆర్డ‌ర్‌.. క‌ష్టాల్లో భార‌త్‌

Day 4 in Kanpur Test India 84/5 at Lunch.కాన్పూర్ వేదిక‌గా న్యూజిలాండ్‌తో జ‌రుగుతున్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో

By తోట‌ వంశీ కుమార్‌  Published on  28 Nov 2021 12:09 PM IST
రెండో ఇన్నింగ్స్‌లో కుప్ప‌కూలిన టాప్ఆర్డ‌ర్‌.. క‌ష్టాల్లో భార‌త్‌

కాన్పూర్ వేదిక‌గా న్యూజిలాండ్‌తో జ‌రుగుతున్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో భార‌త బ్యాట్స్‌మెన్లు త‌డ‌బ‌డ్డారు. ఓవ‌ర్ నైట్ స్కోర్ 14/1 తో ఆదివారం నాలుగోరోజు ఆట‌ను ప్రారంభించిన టీమ్ ఇండియాను కివీస్ బౌల‌ర్లు కైల్ జేమీస‌న్(2/21), టీమ్‌సౌథి(2/27), అజాజ్ ప‌టేల్‌(1/29) దెబ్బ‌తీశారు. దీంతో లంచ్ విరామానికి భార‌త్ 84/5తో నిలిచింది. ప్ర‌స్తుతం క్రీజులో తొలి ఇన్నింగ్స్‌లో శ‌త‌కం చేసిన సాధించిన శ్రేయాస్ అయ్య‌ర్‌(18)తో పాటు ర‌విచంద్ర‌న్ అశ్విన్‌(20) ఉన్నారు. వీరిద్ద‌రు అభేద్య‌మైన ఆరో వికెట్‌కు 74 బంతుల్లో 33 ప‌రుగులు జోడించారు. తొలి ఇన్నింగ్స్ లో ల‌భించిన ఆధిక్యం 49 ప‌రుగులు క‌లుకుని ప్ర‌స్తుతం టీమ్ఇండియా 133 ప‌రుగుల ఆధిక్యంలో ఉంది.

అంత‌క‌ముందు ఓవ‌ర్‌నైట్ స్కోర్ 14/1 తో నాలుగో రోజు ఆట‌ను ఆరంభించిన భార‌త్‌కు జేమీస‌న్ షాక్ ఇచ్చాడు. న‌యా వాల్ (22)ను షార్ట్‌పిచ్ బంతిలో పెవిలియ‌న్ చేర్చాడు. దీంతో 32 ప‌రుగుల వ‌ద్ద భార‌త జ‌ట్టు రెండో వికెట్ కోల్పోయింది. ఇక్క‌డ మొద‌లైన వికెట్ల ప‌త‌నం చాలా వేగంగా సాగింది. కెప్టెన్ అజింక్య ర‌హానే(4)ను అజాజ్ ప‌టేల్ ఔట్ చేయ‌గా.. టిమ్‌సౌథి ఒకే ఓవ‌ర్‌లో మయాంక్ అగ‌ర్వాల్‌(17), ర‌వీంద్ర జ‌డేజా(0)ల‌ను ఔట్ చేసిన భార‌త్‌ను కోలుకోలేని దెబ్బ‌తీశాడు. దీంతో 51 ప‌రుగుల‌కే స‌గం వికెట్లు కోల్పోయి టీమ్ఇండియా క‌ష్టాల్లో ప‌డింది. తొలి ఇన్నింగ్స్‌లో శ‌త‌కం సాధించిన శ్రేయాస్‌, అశ్విన్ మ‌రో వికెట్ ప‌డ‌కుండా తొలి సెష‌న్‌ను ముగించారు. వీరిద్ద‌రు ఎలా ఆడ‌తారు అనే దానిపైనే భార‌త అవ‌కాశాలు ఆధార‌ప‌డి ఉన్నాయి.

Next Story