పాక్‌పై భారత్ ఘన విజయం.. ధోని రికార్డును బ్రేక్ చేసిన హర్మన్
CWG 2022 India beat Pakistan by 8 wickets in womens Group A clash.కామన్వెల్త్ గేమ్స్‌లో భారత మహిళల జట్టు అద్భుత
By తోట వంశీ కుమార్ Published on 1 Aug 2022 3:23 AM GMTకామన్వెల్త్ గేమ్స్‌లో భారత మహిళల జట్టు అద్భుత ప్రదర్శనతో దాయాది పాకిస్తాన్‌ను చిత్తు చేసింది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో అద్భుత ప్రదర్శన చేసి 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో సెమీస్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. వర్షం అంతరాయం కలిగించడంతో 18 ఓవర్లకు మ్యాచ్‌ను కుదించారు. తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ 18 ఓవర్లలో 99 పరుగులకు ఆలౌట్ అయింది. పాక్ బ్యాటర్లలో మునీబా (32) టాప్ స్కోరర్‌గా నిలిచింది. భారత బౌలర్లలో స్నేహ్ రాణా, రాధ యాదవ్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. రేణుక, మేఘన సింగ్, షఫాలీ వర్మ తలా ఒక వికెట్ పడగొట్టారు.
అనంతరం స్టార్ ఓపెనర్ స్మృతి మందన (63 నాటౌట్; 42 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్సర్లు) దంచికొట్టడంతో భారత్ 11.4 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. షఫాలీ వర్మ (16), సబ్బినేని మేఘన (14) ఫర్వాలేదనిపించారు. బుధవారం బార్బడోస్‌తో జరిగే చివరి లీగ్ మ్యాచ్‌లో భారత్ తలపడుతుంది.
ధోని రికార్డును బ్రేక్ చేసిన హర్మన్ ప్రీత్
భారత మహిళల జట్టు కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. అంతర్జాతీయ స్థాయిలో అత్యధిక టీ20 మ్యాచుల్లో విజయాలను నమోదు చేసిన టీమ్ఇండియా కెప్టెన్‌గా నిలిచింది. ఈ క్రమంలో భారత్‌కు టీ20 ప్రపంచకప్‌ను అందించిన మాజీ సారథి ఎంఎస్ ధోని రికార్డును హర్మన్ అధిగమించింది. ఇప్పటి వరకు హర్మన్ 71 టీ20 మ్యాచ్‌లకు కెప్టెన్‌గా వ్యవహరించగా.. 42 మ్యాచుల్లో విజయం సాధించగా 26 మ్యాచుల్లో భారత్ ఓడింది. మూడు మ్యాచుల్లో పలితం లేకపోయింది. ఇక ధోని 72 మ్యాచులకు సారథిగా వ్యవహరించగా 41 మ్యాచుల్లో గెలువగా, 28 మ్యాచ్‌లో భారత్ ఓడిపోయింది. ఓ మ్యాచ్ టైగా ముగియగా మరో రెండింటి ఫలితం తేలలేదు.