చెన్నై సూపర్ కింగ్స్ ఫ్యాన్ ను చంపేసిన ముంబై అభిమానులు

ఐపీఎల్ కు దేశ వ్యాప్తంగా ఎంతో పాపులారిటీ ఉంది. అదే విధంగా జట్లకు ఉన్న అభిమానుల గొడవల కారణంగా కొందరి ప్రాణాలు కూడా పోతున్నాయి.

By Medi Samrat  Published on  31 March 2024 5:59 PM IST
చెన్నై సూపర్ కింగ్స్ ఫ్యాన్ ను చంపేసిన ముంబై అభిమానులు

ఐపీఎల్ కు దేశ వ్యాప్తంగా ఎంతో పాపులారిటీ ఉంది. అదే విధంగా జట్లకు ఉన్న అభిమానుల గొడవల కారణంగా కొందరి ప్రాణాలు కూడా పోతున్నాయి. తాజాగా అలాంటి దిగ్భ్రాంతికరమైన ఘటన చోటు చేసుకుంది. కొల్హాపూర్‌లో గత బుధవారం (మార్చి 27) జరిగిన దాడి కారణంగా ఒక వృద్ధుడు మరణించాడు. IPL 2024లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన ముంబై ఇండియన్స్ మ్యాచ్‌లో రోహిత్ శర్మ వికెట్‌ పడడంతో సంబరాలు చేసుకున్న చెన్నై సూపర్ కింగ్స్ అభిమానిని.. ఇద్దరు ముంబై ఇండియన్స్ మద్దతుదారులు దాడి చేశారు. మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లో చికిత్స పొందుతూ ఆ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు.

చనిపోయిన వ్యక్తిని 63 ఏళ్ల బందోపంత్ బాపుసో టిబిలేగా గుర్తించారు. రోహిత్ శర్మ వికెట్‌ పడడంతో సంబరాలు చేసుకోవడంతో ఇద్దరు MI మద్దతుదారులు దాడి చేశారు. టిబిలే ఇతరులతో కలిసి టెలివిజన్‌లో మ్యాచ్ చూస్తున్నప్పుడు వాగ్వాదం జరిగింది. అక్కడే ఉన్న ముంబై అభిమానులు సాగర్ సదాశివ్ ఝంజాగే (35), బల్వంత్ మహదేవ్ జంజాగే (50)లు కోపంతో దాడికి తెగబడ్డారు. నిందితులు టిబిలేను తలపై కర్రలతో కొట్టారు. బాధితుడిని వెంటనే ఆసుపత్రికి తరలించగా, మార్చి 31న మృతి చెందాడు.

Next Story