నువ్వు బెస్ట్ కెప్టెన్‌.. ఇదొక‌ విచారకరమైన రోజు

Cricket Fraternity Reacts To Virat Kohli Stepping Down As India Test Captain.టీమ్ఇండియా టెస్టు కెప్టెన్సీకి విరాట్

By తోట‌ వంశీ కుమార్‌  Published on  16 Jan 2022 7:36 AM GMT
నువ్వు బెస్ట్ కెప్టెన్‌.. ఇదొక‌ విచారకరమైన రోజు

టీమ్ఇండియా టెస్టు కెప్టెన్సీకి విరాట్ కోహ్లీ గుడ్ బై చెప్పేయ‌డం చాలా మందిని షాక్ కు గురిచేసింది. దీంతో అన్ని ఫార్మాట్ల సార‌థ్యం నుంచి కోహ్లీ త‌ప్పుకున్న‌ట్లే. భార‌త క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) అధ్య‌క్షుడు సౌర‌వ్ గంగూలీ, దిగ్గ‌జ క్రికెట‌ర్ స‌చిన్ టెండూల్క‌ర్‌, వ‌సీం జాఫ‌ర్‌, టీమ్ఇండియా మాజీ కోచ్ ర‌విశాస్త్రి, ప‌రిమిత ఓవ‌ర్ల కెప్టెన్ హిట్‌మ్యాన్ రోహిత్ శ‌ర్మ త‌దిత‌రులు కోహ్లీ తీసుకున్న నిర్ణ‌యంపై సోష‌ల్ మీడియా వేదిక‌గా పోస్టులు పెట్టారు.

అన్ని ఫార్మాట్లలోనూ భారత జట్టును అగ్రపథంలో నిలపడంలో విరాట్‌ ఎనలేని కృషిని చేశాడు. సారథ్య బాధ్యతల నుంచి తప్పుకోవడం తన వ్యక్తిగత నిర్ణయం. దాన్ని బీసీసీఐ గౌరవిస్తుంది. భ‌విష్య‌త్తులో టీమ్ ఉన్న‌త శిఖ‌రాల‌కు చేర్చ‌డంలో త‌న వంతు పాత్ర పోషిస్తాడ‌ని బావిస్తున్నా. గొప్ప ఆట‌గాడు - సౌర‌వ్ గంగూలీ

విరాట్‌.. నువ్వు తలెత్తుకుని సగర్వంగా ముందుకు వెళ్లవచ్చు. కెప్టెన్‌గా నీలాంటి అద్బుత విజయాలు కొంతమంది మాత్రమే సాధించగలరు. భారత జట్టు అత్యంత విజయవంతమైన, దూకుడైన సారథివి కచ్చితంగా నువ్వే. అయితే, వ్యక్తిగతంగా నాకిది విచారకరమైన రోజు. మనిద్దరం కలిసి ఈ జట్టును శక్తిమంతంగా తీర్చిదిద్దాం కదా కోహ్లి - ర‌విశాస్త్రి

కెప్టెన్‌గా అద్భుతంగా రాణించిన విరాట్ కి కంగ్రాట్యులేషన్స్‌. నువ్వు జట్టు కోసం వంద‌శాతం కృషి చేశావు. భ‌విష్య‌త్తులోనూ మంచి జ‌ర‌గాలని ఆశిస్తున్నా - స‌చిన్ టెండూల్క‌ర్

షాక్‌.. కానీ భారత కెప్టెన్ గా విజయవంతమైన సేవలు అందించినందుకు అభినందనలు. నీ భవిష్యత్తు మరింత బాగుండాలి - రోహిత్ శ‌ర్మ

Next Story