అమెరికా, వెస్టిండీస్‌లో టీ20 ప్రపంచకప్ జరుగుతుండగా.. క్రికెట్ ప్రపంచానికి ఓ చేదువార్త అందింది. ఫ్రాంక్ డక్‌వర్త్.. ఇంగ్లీష్ గణాంకవేత్త, డక్‌వర్త్ లూయిస్-స్టెర్న్ (DLS) పద్ధతి యొక్క సృష్టికర్తలలో ఒకరైన 84 సంవత్సరాల డక్‌వర్త్ మరణించారు. నివేదికల ప్రకారం ఆయన జూన్ 21న మరణించారు.
డక్‌వర్త్-లూయిస్ పద్ధతిని డక్‌వర్త్, అతని సహచర గణాంక నిపుణుడు టోనీ లూయిస్ రూపొందించారు. వర్షం వల్ల ప్రభావితమైన మ్యాచ్‌ల ఫలితాలను అంచనా వేయడానికి ఈ పద్ధతిని ఉపయోగిస్తారు. ఈ విధానాన్ని అంతర్జాతీయ క్రికెట్‌లో మొదటిసారిగా 1997లో ప్రవేశపెట్టారు. 2001లో ఓవర్‌ల సంఖ్య తగ్గించబడిన మ్యాచ్‌లలో సవరించిన లక్ష్యాలను అందించడానికి ప్రామాణిక వ్యవస్థగా ICCచే ఆమోదించబడింది.
డక్‌వర్త్, లూయిస్‌ల తర్వాత ఆస్ట్రేలియన్ గణాంకవేత్త స్టీవెన్ స్టెర్న్ చేసిన కొన్ని మార్పులు చేశారు. దీంతో ఈ పద్ధతికి డక్‌వర్త్-లూయిస్-స్టెర్న్(DLS) అని పేరు పెట్టారు. జూన్ 2010లో డక్‌వర్త్, లూయిస్‌లకు ఆర్డర్ ఆఫ్ ది బ్రిటిష్ ఎంపైర్ (MBE) మెంబర్ షిప్‌లు లభించాయి.
DLS పద్దతి సంక్లిష్టమైన గణాంక విశ్లేషణపై ఆధారపడి ఉంటుంది, ఇది తదుపరి బ్యాటింగ్ చేసే జట్టుకు సవరించిన లక్ష్యాన్ని నిర్దేశించడానికి మిగిలి ఉన్న వికెట్లు, తగ్గించబడిన ఓవర్‌లతో సహా వివిధ అంశాలను పరిగణనలోకి తీసుకుంటుంది.