ధోనీ ఐపీఎల్ రిటైర్మెంట్‌పై చెన్నై ఫ్రాంచైజీ కీలక ప్రకటన
ఎంఎస్ ధోనీకి ఉన్న ఫ్యాన్ బేస్ గురించి అందరికీ తెలిసిందే.
By Srikanth Gundamalla Published on 20 May 2024 12:38 PM ISTధోనీ ఐపీఎల్ రిటైర్మెంట్‌పై చెన్నై ఫ్రాంచైజీ కీలక ప్రకటన
ఎంఎస్ ధోనీకి ఉన్న ఫ్యాన్ బేస్ గురించి అందరికీ తెలిసిందే. టీమిండియాకు కెప్టెన్‌గా ఎన్నో విజయాలను అందించిన ధోనీ.. రిటైర్మెంట్ తీసుకుని చాలా కాలం అయ్యింది. ప్రస్తుతం ఈయన ఐపీఎల్ సీజన్‌లో మాత్రమే కనిపిస్తున్నారు. ఇటీవల ఎంఎస్ ధోనీ ఐపీఎల్‌కు కూడా గుడ్‌బై చెబుతారని వార్తలు వినిపించాయి. గత సీజన్ నుంచే ఈ వార్తలు వస్తున్నాయి. 2024 ఐపీఎల్ సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ లీగ్ దశ నుంచి నిష్క్రమించింది. అయితే.. ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్ గురించి తాజాగా చెన్నై ఫ్రాంచైజీ ఇంట్రెస్టింగ్ విషయాలను వెల్లడించింది.
ధోనీ ఐపీఎల్‌లో తన ఫ్యూచర్ గురించి ఇంకా తమతో ఏమీ చెప్పలేదని చెన్నై ఫ్రాంచైజీ తెలిపింది. తాను ఐపీఎల్ నుంచి వైదొలుగుతానని ఎప్పడూ అనలేదని వివరించింది. మేనేజ్‌మెంట్‌తో తన నిర్ణయం వెల్లడించేందుకు కాస్త సమయం తీసుకుంటాడని అనుకుంటున్నట్లు వెల్లడించింది చెన్నై ఫ్రాంచైజీ. మరోవైపు ఇంకా ఎంఎస్ ధోనీ క్రికెట్ ఆడేందుకు ఫిట్‌గానే ఉన్నాడని భావిస్తున్నామని చెప్పింది. ఈ సీజన్‌లో వికెట్ల మధ్య పరిగేందుకు ఎక్కడా ఇబ్బంది పడినట్లు అనిపించలేదని అన్నది. వచ్చే సీజన్‌లో ఇంపాక్ట్ రూల్‌ను ఉపయోగించుకుని ధోనీని కేవలం బ్యాటింగ్‌కే దిగేల ఆచూడాలని అభిమానులు కోరుతున్నారని ఈ సందర్భంగా చెన్నై ఫ్రాంచైజీ చెప్పింది. అయితే.. ఎంఎస్ ధోనీ ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో ఎవరికీ తెలియదు. ఈ సీజన్ ఇప్పుడే అయ్యింది కాబట్టి.. ఇక ముందు ఎలాంటి డెసిషన్ అయినా తీసుకోవచ్చని సీఎస్కే వర్గాలు చెబుతున్నాయి. ధోనీ ఎప్పుడూ జట్టు కోసమే నిర్ణయాలు తీసుకుంటాడనీ.. ఆయన ఎలాంటి డెసిషన్ తీసుకున్నా తమకు ఒకే అని సీఎస్కే వెల్లడించింది.
ఎంఎస్ ధోనీ ఎప్పటిలానే ఈ సీజన్‌లో కూడా రాణించాడు. బెస్ట్ ఫినిషర్‌గా పేరును నిలబెట్టుకున్నాడు. ఆఖర్లో వస్తూ మెరుపు సిక్స్‌లు బాదుతూ.. తన హెలికాప్టర్ షాట్స్ కొడుతూ అభిమానులను ఉర్రూతలూగించాడు. తలా ఒక్కసారి బ్యాటింగ్ చేస్తే చూడాలని గ్రౌండ్‌కు వచ్చిన వారిని ఇంప్రెస్ చేశాడు. అయితే.. మున్ముందు ఐపీఎల్‌లో ధోనీ కొనసాగుతాడా? లేదా అన్నది ఆయనే చెప్పాలి.