Champions Trophy: ఫైనల్, రిజర్వ్ డే రూల్స్‌.. వర్షం కురిస్తే ఎవరు గెలుస్తారంటే?

నేడు ఛాంపియన్స్ ట్రోఫీ 2025 గ్రాండ్ ఫైనల్‌లో రోహిత్ శర్మ నేతృత్వంలోని ఇండియా, మిచెల్ సాంట్నర్ నేతృత్వంలోని న్యూజిలాండ్ తలపడనున్నాయి.

By అంజి
Published on : 9 March 2025 9:15 AM IST

Champions Trophy, final reserve day rules, rain , india, newzealand

Champions Trophy: ఫైనల్, రిజర్వ్ డే రూల్స్‌.. వర్షం కురిస్తే ఎవరు గెలుస్తారంటే?

నేడు (మార్చి 9 ఆదివారం) దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీ 2025 గ్రాండ్ ఫైనల్‌లో రోహిత్ శర్మ నేతృత్వంలోని ఇండియా, మిచెల్ సాంట్నర్ నేతృత్వంలోని న్యూజిలాండ్ తలపడనున్నాయి. మ్యాచ్ జరిగేటప్పుడు మేఘాలు కమ్ముకునే అవకాశం ఉంది. కానీ ప్రస్తుతానికి వర్షం పడే అవకాశం లేదు.

ఒక వేళ మ్యాచ్‌ని వర్షం ఆటంకపరిస్తే? 2002లో వర్షం కారణంగా ఫైనల్‌, రిజర్వ్ డే రోజు మ్యాచ్‌ జరగలేదు. ఆ తర్వాత భారతదేశం, శ్రీలంక ట్రోఫీని పంచుకున్నాయి. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్‌కు, సోమవారం, మార్చి 10న రిజర్వ్ డే ఉంది. ఫైనల్ మ్యాచ్ ఫలితం రావాలంటే జట్లు కనీసం 25 ఓవర్లు ఆడాలి. ఆదివారం వర్షం ఆటకు అంతరాయం కలిగిస్తే, సోమవారం అదే మ్యాచ్ తిరిగి ప్రారంభమవుతుంది. వర్షం కారణంగా అసలు, రిజర్వ్ డేల రోజు మ్యాచ్‌ జరగపోతే భారతదేశం, న్యూజిలాండ్ జట్లను ఉమ్మడి విజేతలుగా ప్రకటిస్తారు.

"షెడ్యూల్ చేసిన రోజున ఆటకు అంతరాయం కలిగితే, అంపైర్లు అందుబాటులో ఉన్న అదనపు సమయాన్ని ఉపయోగించుకోవాలి. అవసరమైతే, ఆ రోజున ఫలితం సాధించడానికి ప్రయత్నించడానికి ఓవర్ల సంఖ్యను తగ్గించాలి" అని ఐసిసి తుది ఆట నిబంధనలను పేర్కొంది. "మైదానం, వాతావరణం, వెలుతురు విషయంలో నిర్ణయాలు తీసుకునేటప్పుడు, రిజర్వ్ డే అందుబాటులో లేనట్లుగా, ఆ రోజున ఫలితాన్ని సాధించడానికి, అంపైర్లు మ్యాచ్ షెడ్యూల్ చేయబడిన రోజున ఆటను గరిష్టీకరించడం లక్ష్యంగా పెట్టుకోవాలి."

"ప్రతి జట్టుకు ఫలితం సాధించాలంటే కనీసం ఇరవై ఐదు (25) ఓవర్లు బ్యాటింగ్ చేసే అవకాశం ఉండాలి. షెడ్యూల్ చేసిన రోజున ఫలితం సాధించడానికి కనీస ఓవర్ల సంఖ్యను బౌల్ చేయడానికి అవసరమైన కటాఫ్ సమయానికి ఆట తిరిగి ప్రారంభించబడకపోతే, ఆ రోజు ఆటను రద్దు చేస్తారు. మ్యాచ్‌ను పూర్తి చేయడానికి లేదా తిరిగి ఆడటానికి రిజర్వ్ డేను ఉపయోగిస్తారు. అసంపూర్ణ మ్యాచ్‌ను కొనసాగించడానికి రిజర్వ్ డేను ఉపయోగిస్తారు."

Next Story