బీఎస్ఎఫ్ రిక్రూట్‌మెంట్.. వారికి 10 శాతం రిజర్వేషన్లు ప్రకటించిన కేంద్రం
Centre Announces 10 Percent Reservation For Ex-Agniveers In BSF. అగ్నివీరుల కోసం బీఎస్ఎఫ్ రిక్రూట్‌మెంట్‌లో 10 శాతం రిజర్వేషన్లను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.
By Medi Samrat Published on 10 March 2023 9:15 PM ISTCentre Announces 10 Percent Reservation For Ex-Agniveers In BSF
అగ్నివీరుల కోసం బీఎస్ఎఫ్ రిక్రూట్‌మెంట్‌లో 10 శాతం రిజర్వేషన్లను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్, బీఎస్ఎఫ్ రిక్రూట్‌మెంట్ నిబంధనల ప్రకారం ప్రభుత్వం రిక్రూట్‌మెంట్ నిబంధనలను సవరించింది. 10 శాతం రిజర్వేషన్‌తో పాటు, మాజీ అగ్నివీరులకు ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ రౌండ్ నుండి మినహాయింపు ఉంటుందని ప్రకటిస్తూ హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ నోటీసు జారీ చేసింది. "కేంద్ర ప్రభుత్వం BSFలోని ఖాళీలలో మాజీ-అగ్నివీర్లకు 10% రిజర్వేషన్లను ప్రకటించింది, అలాగే వారు మొదటి బ్యాచ్ లేదా తదుపరి బ్యాచ్‌లలో భాగమా అనేదానిపై ఆధారపడి గరిష్ట వయోపరిమితి నిబంధనలను సడలించింది. MHA మార్చి 6వ తేదీన నోటిఫికేషన్ ద్వారా ఈ ప్రకటన చేసింది" అని ANI ట్వీట్ చేసింది. అగ్నివీరులుగా రిటైర్ అయ్యేవారికి బీఎస్‌ఎఫ్ (BSF) నియామాకాల్లో ప్రాధాన్యత ఇస్తామని.. సరిహద్దు భద్రతా దళంలో 10 శాతం రిజర్వేషన్ కల్పించనున్నట్టు ప్రకటించింది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను కేంద్ర హోం శాఖ విడుదల చేసింది. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్, జనరల్ డ్యూటీ కేడర్-2015కు సంబంధించిన నిబంధనలను కేంద్రం సవరించింది.
అగ్నివీర్ మొదటి బ్యాచ్‌లో చేరి విశ్రాంతి తీసుకునే సైనికులకు 5 సంవత్సరాలు, తర్వాత బ్యాచ్‌లలో చేరి రిటైర్ అయిన అభ్యర్థులకు 3 సంవత్సరాల వరకూ గరిష్ట వయోపరిమితిని సడలించనున్నారు. మజీ అగ్నివీరులకు బీఎస్‌ఎఫ్ నియామక ప్రక్రియలో దేహడారుఢ్య పరీక్షల నుంచి సైతం మినహాయింపు కల్పించనున్నారు. నాలుగేళ్ల పాటు దేశ సైనికులుగా సేవలందించిన అగ్నివీరులకు సీఏఎస్ఎఫ్, అసోం రైఫిల్స్‌తో పాటు బీఎస్ఎఫ్ నియామకాల్లో వయోపరిమితిని 3, 5 సంవత్సరాలకు పెంచడం, దేహదారుఢ్య పరీక్షల నుంచి మినహాయింపు కల్పించడం వల్ల ఉద్యోగార్ధులకు మరింత లబ్ధి చేకూరుతుందని చెబుతున్నారు. హోం శాఖ తాజా ఉత్తర్వుల ప్రకారం తొలి బ్యాచ్‌లోని అభ్యర్థులు 28 సంవత్సరాల వరకూ అగ్నివీర్‌గా సేవలందించి, ఆపై కేంద్ర భద్రతా దళాలు, అసోం రైఫిల్స్‌లో చేరేందుకు 10 శాతం రిజర్వేషన్ వెసులుబాటు కల్పిస్తుంది.