పెర్త్ టెస్ట్ మ్యాచ్ లో మొదటి రోజు భారత బౌలర్లు ఆస్ట్రేలియాకు షాకిచ్చారు. ఆప్టస్ స్టేడియంలో జరిగిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో మొదటి రోజు భారత్ ఆధిపత్యం చెలాయించింది. విరాట్ కోహ్లి, స్టీవ్ స్మిత్ లాంటి స్టార్ బ్యాటర్లు ఎలాంటి మంచి ప్రదర్శన చేయలేకపోయారు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా 7 వికెట్ల నష్టానికి 67 పరుగులు చేసింది. ప్రస్తుతం ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ లో 83 పరుగులు వెనకబడి ఉంది. క్రీజ్ లో క్యారీ (19), స్టార్క్ (6) ఉన్నారు. ఖవాజా 8, హెడ్(11), మార్ష్ (6), లబు షేన్ (2), కమ్మిన్స్ (3) త్వరగానే పెవిలియన్ కు చేరారు. బుమ్రా 4 వికెట్లు తీశాడు.
మొదట బ్యాటింగ్ చేసిన భారత్ తొలి ఇన్నింగ్స్ లో 150 పరుగులకు ఆలౌట్ అయింది. రిషబ్ పంత్(37) , నితీష్ కుమార్ రెడ్డి(41) మినహాయిస్తే మిగిలిన వారందరూ ఘోరంగా విఫలమయ్యారు. జైశ్వాల్ (0), పడికల్ (0), కోహ్లీ (5) విఫలమయ్యారు. కేఎల్ రాహుల్ క్యాచ్ వ్యవహారం ఈరోజు అత్యంత వివాదాస్పదమైంది.