పశ్చిమ బెంగాల్ క్రీడల మంత్రి మనోజ్ తివారీ జార్ఖండ్‌తో జరిగిన రంజీ ట్రోఫీ క్వార్టర్-ఫైనల్ మ్యాచ్‌లో అద్భుతంగా ఆడాడు. ఈ మ్యాచ్‌లోని రెండు ఇన్నింగ్స్‌లలో 73 మరియు 136 పరుగులు చేశాడు. తివారీ తన 28వ ఫస్ట్-క్లాస్ సెంచరీని సాధించిన తర్వాత తొడకొట్టి మరీ సెలెబ్రేట్ చేసుకున్నాడు. జార్ఖండ్‌తో జరుగుతున్న రంజీ ట్రోఫీ నాలుగో క్వార్టర్ ఫైనల్ చివరి రోజున బెంగాల్ 750 పరుగుల మార్కును అధిగమించింది. 185 బంతుల్లో 136 పరుగులు చేసి మనోజ్ తివారీ అవుట్ అయ్యాడు. బెంగాల్ క్రీడల మంత్రి అయిన తర్వాత ఇది అతని మొదటి ఫస్ట్ క్లాస్ సెంచరీ.
మనోజ్ తివారీ చివరి సారిగా మూడు అంకెల స్కోరును 2019-20 సీజన్‌లో చేశారు. హైదరాబాద్‌పై అజేయంగా 303 పరుగులు సాధించాడు. 36 ఏళ్ల బెంగాల్ మాజీ కెప్టెన్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు TMCలో చేరారు. 2021లో BJPకి చెందిన రతిన్ చక్రవర్తిని ఓడించి, శిబ్‌పూర్ నియోజకవర్గంలో గెలిచారు. అతను ప్రస్తుతం పశ్చిమ బెంగాల్‌లోని మమతా బెనర్జీ నేతృత్వంలోని ప్రభుత్వంలో క్రీడలు, యువజన వ్యవహారాల మంత్రిగా పనిచేస్తున్నాడు.