భయం లేకుండా ఆడతా : పుజారా
Being fearless has helped me enjoy my game says Cheteshwar Pujara.టీ20 సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసిన టీమ్ఇండియా
By తోట వంశీ కుమార్
టీ20 సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసిన టీమ్ఇండియా టెస్టు సిరీస్‌కు ఉత్సాహాంగా సన్నద్దమవుతోంది. టెస్టు స్పెషలిస్టులు పుజారీ, రహానే వంటి ఆటగాళ్లు రావడంతో టీమ్ఇండియా బలంగా కనిపిస్తోంది. అయితే.. గత కొంతకాలంగా ఈ ఇద్దరూ బ్యాటింగ్‌లో నిలకడగా రాణించలేదు. ముఖ్యంగా పుజారా సెంచరీ చేసి రెండేళ్లు దాటిపోయింది. కాన్పూర్ వేదికగా గురువారం నుంచి కివీస్‌తో తొలి టెస్టు ప్రారంభం కానుంది.
ఈ నేపథ్యంలో పుజారా మీడియాతో మాట్లాడాడు. రెండు టెస్టుల సిరీస్‌లో భయపడకుండా ఆడాలని అనుకుంటున్నట్లు పుజారా చెప్పాడు. ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌ను నుంచి తన ఆలోచన విధానం సరికొత్తగా ఉండదన్నాడు. టెక్నికల్‌గా బ్యాటింగ్‌లో చేసుకున్న మార్పులు ఏమీ లేవన్నాడు. ఏ మాత్రం భయం లేకుండా ఆడుతున్నానని.. రాబోయే కివీస్‌తో సిరీస్‌లో కూడా అదే కొనసాగించాలని బావిస్తున్నట్లు చెప్పుకొచ్చాడు.
ఇక పుజారా శతకం సాధించి రెండేళ్లుకు పైగా దాటిపోయింది. దీనిపై మాట్లాడుతూ.. శతకం గురించి ఆలోచించడం లేదన్నాడు. తన టెస్టు కెరీర్‌లో ఓ సెంచరీకి ఇంత సమయం తీసుకోవడం ఇదే తొలిసారి అని అన్నాడు. ఇటీవల ఆడిన మ్యాచ్‌ల్లో 50 నుంచి 60 పరుగులు సాధిస్తున్నానని.. కివీస్‌తో సిరీస్‌లో శతకం సాధిస్తాననే ధీమాని వ్యక్తం చేశాడు. ప్రతి ఆటగాడికి గడ్డుకాలం అనేది ఉంటుందని.. ప్రస్తుతం రహానే అలాంటి కాలాన్నే ఎదుర్కొంటున్నట్లు చెప్పాడు. రహానే చాలా గొప్ప బ్యాట్స్‌మెన్ అని.. ఒక్క ఇన్నింగ్స్‌తో ఫామ్‌లో వస్తాడన్నాడు. అతని కష్టపడే తత్వమే పరుగులు వచ్చేలా చేస్తాయని.. ఒక్కసారి లయ అందుకున్నాడంటే వెనక్కి తిరిగిచూసుకోవాల్సిన అవసరం లేదని పుజారా తెలిపాడు.
2019 జనవరిలో ఆస్ట్రేలియాతో సిడ్నీ వేదికగా జరిగిన టెస్టు మ్యాచ్‌లో పుజారా (193 పరుగులు) ఆఖరిసారి శతకాన్ని చేశాడు. అప్పటినుంచి 22 టెస్టుల్లో ఆడగా.. ఒక్క సెంచరీ కూడా చేయలేదు. ఓవరాల్‌గా పుజారా ఇప్పటి వరకు 90 టెస్టుల్లో 6494 పరుగులు చేశాడు. ఇందులో 18 సెంచరీలు, 31 అర్థసెంచరీలు ఉన్నాయి.