టీ20 ప్రపంచకప్.. మారనున్న టీమ్ఇండియా జెర్సీ
BCCI update on Team India's new T20 World Cup jersey.యూఏఈ వేదికగా జరిగే టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టు ఆటగాళ్లు
By తోట వంశీ కుమార్ Published on
8 Oct 2021 9:52 AM GMT

యూఏఈ వేదికగా జరిగే టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టు ఆటగాళ్లు కొత్త జెర్సీల్లో కనిపించనున్నారు. ఈ మేరకు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) ఓ అప్‌డేట్‌ను ఇచ్చింది. అయితే.. కొత్త జెర్సీ ఎలా ఉంటుంది, ఏ రంగులో ఉంటుంది అన్న విషయాలను మాత్రం వెల్లడించలేదు. ఈ నెల 13వ తేదీన జెర్సీని లాంచ్ చేయనున్నట్లు బీసీసీఐ ట్వీట్ చేసింది. భారత క్రికెట్ జట్టుకు అఫిషియల్ కిట్ స్పాన్సర్ అయిన ఎంపీఎల్ స్పోర్ట్స్ నూతన జెర్సీని ఆవిష్కరించనుంది.
కాగా.. గతేడాది ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 సిరీస్‌లో భారత ఆటగాళ్లు నేవి బ్లూ జెర్సీలో కనిపించిన సంగతి తెలిసిందే. ఇక టీ20 ప్రపంచకప్‌లో టీమ్ఇండియా తన తొలి మ్యాచ్‌ను అక్టోబర్ 24న దాయాది పాకిస్థాన్‌తో ఆడనుంది. ఆ తరువాత అక్టోబర్ 31న న్యూజిలాండ్‌తో, నవంబర్ 3న అఫ్గానిస్తాన్‌తో భారత్ మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఈ మ్యాచ్‌లన్నీ భారతకాలమానం ప్రకారం రాత్రి 7:30 గంటలకు మొదలవుతాయి.
Next Story