ప్రపంచకప్‌కు 20 మంది ఆటగాళ్లను షార్ట్‌లిస్ట్ చేసిన‌ బీసీసీఐ

BCCI shortlists 20 players for 2023 ICC Men's World Cup. 2023 పురుషుల ప్రపంచకప్‌లో ఆడటానికి 20 మంది ఆటగాళ్లను బీసీసీఐ షార్ట్‌లిస్ట్ చేసింది.

By M.S.R  Published on  2 Jan 2023 3:45 PM GMT
ప్రపంచకప్‌కు 20 మంది ఆటగాళ్లను షార్ట్‌లిస్ట్ చేసిన‌ బీసీసీఐ

2023 పురుషుల ప్రపంచకప్‌లో ఆడటానికి 20 మంది ఆటగాళ్లను బీసీసీఐ షార్ట్‌లిస్ట్ చేసింది. బీసీసీఐ సమీక్ష సమావేశంలో, 2023లో భారత్‌లో జరగనున్న ప్రపంచకప్‌కు ముందు సరైన సన్నద్ధత ఉండేలా ఈ ఆటగాళ్లను రొటేషన్ విధానంలో ఆడించాలని బీసీసీఐ నిర్ణయించింది. ముంబయిలో ఈ సమావేశానికి హాజరైన రాహుల్ ద్రవిడ్, కెప్టెన్ రోహిత్ శర్మ, చీఫ్ సెలెక్టర్ చేతన్ శర్మ, NCA హెడ్ VVS లక్ష్మణ్ దాదాపు నాలుగు గంటలపాటు చర్చించారు. కీలక నిర్ణయాలు తీసుకున్నారు. బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశానికి హాజరయ్యారు.

ఈ మీటింగ్ లో గత ప్రదర్శనను సమీక్షించారు. ప్రపంచ కప్, ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC)తో సహా భవిష్యత్ ఈవెంట్‌లకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అలాగే అంతర్జాతీయ క్రికెట్‌కు కూడా ప్రాధాన్యత ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్నామని బీసీసీఐ వర్గాలు తెలిపాయి.

వరల్డ్ కప్ ఆడే ఆటగాళ్ల విషయంలో కొన్ని జాగ్రత్తలు తప్పవని తేల్చి చెప్పింది. వీవీఎస్ లక్ష్మణ్ నేతృత్వంలోని ఎన్సీయే బృందం ఈ ఆటగాళ్లను మానిటర్ చేయాలని, ఐపీఎల్‌లో కూడా సదరు ఆటగాళ్లు గాయాలపాలు అవకుండా వర్క్‌లోడ్ మేనేజ్ చేసేలా ఫ్రాంచైజీలతో మాట్లాడాలని తేల్చిచెప్పింది. వన్డే వరల్డ్ కప్ కోసం మొత్తం 20 మంది ఆటగాళ్లను ఎంపిక చేశామని, వాళ్లంతా ఐపీఎల్‌లో మరీ ఎక్కువ స్ట్రెస్ అవకుండా చూసుకోవాలని నిర్ణయించింది. ఇక దేశవాళీ క్రికెట్‌లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన క్రికెటర్లకే టీమిండియాలో ప్రాధాన్యం ఉంటుందని బీసీసీఐ స్పష్టం చేసింది. దీంతో.. ప్రస్తుతం జరుగుతున్న రంజీ ట్రోఫీ 2022-23 సీజన్ లో రాణించిన క్రికెటర్లకు మంచి అవకాశాలు దక్కుతాయి.


Next Story
Share it