మహిళల ఐపీఎల్ ఆంథెమ్‌.. గూస్‌బంప్స్ వ‌స్తున్నాయి

డ‌బ్ల్యూపీఎల్ సీజ‌న్ ప్రారంభం సంద‌ర్భంగా ప్ర‌చారం కోసం ఆంథెమ్ ను బీసీసీఐ విడుద‌ల చేసింది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  2 March 2023 3:00 PM IST
WPL 2023,  WPL 2023 Anthem,

మహిళల ఐపీఎల్ ఆంథెమ్‌

స‌రికొత్త చ‌రిత్ర‌కు శ్రీకారం చుడుతూ భార‌త క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) నిర్వ‌హించ‌నున్న మ‌హిళా ప్రీమియ‌ర్ లీగ్‌(డ‌బ్ల్యూపీఎల్‌) మ‌రో రెండు రోజుల్లో ఆరంభం కానుంది. మార్చి 4న ముంబై ఇండియ‌న్స్‌, గుజ‌రాత్ జెయింట్స్ మ‌ధ్య ప్రారంభ మ్యాచ్‌తో సీజ‌న్ ప్రారంభం కానుంది. ఇప్ప‌టికే ఈ సీజ‌న్‌కు సంబంధించిన ఏర్పాట్లు అన్ని పూర్తి అయ్యాయి. ఈ మెగా టోర్నీకి ప్ర‌చారాన్ని తీసుకువ‌చ్చేందుకు మ‌స్క‌ట్‌ను విడుద‌ల చేసింది

ఒకచేత్తో బ్యాట్‌, మరో చేతిలో హెల్మెట్‌ పట్టుకుని రంగంలో దిగడానికి సిద్ధంగా ఉన్న చీతాను అందులో చూపించారు.

అంతేకాకుండా ఆంథెమ్‌ను విడుద‌ల చేశారు. యేతో బ‌స్ షురువాద్ హై( ఇది కేవ‌లం ఆరంభం మాత్ర‌మే) అంటూ మొద‌లైన ఈ గీతం అమ్మాయిల సంక‌ల్ప బ‌లానికి, మ‌హిళా శ‌క్తికి అద్దం ప‌ట్టేలా ఉంది. ఈ పాట వింటుంటే గూస్‌బంప్స్ రావ‌డం ఖాయం.

మహిళల ఐపీఎల్‌ ఈ నెల 4 నుంచి 26 వరకు ముంబైలో జరుగనుంది. డబ్ల్యూపీఎల్ తొలి సీజన్లో ఐదు ఫ్రాంచైజీలు బరిలోకి దిగనున్నాయి. అహ్మదాబాద్, ముంబై, ఢిల్లీ, బెంగళూరు, లక్నో నగరాల్లో మ్యాచ్‌లు జ‌ర‌గ‌నున్నాయి.

Next Story