కొత్త జెర్సీని విడుదల చేసిన ముంబై ఇండియన్స్

Mumbai Indians Unveil Official Jersey For Women's Premier League 2023. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ ప్రారంభ ఎడిషన్ కు ఇప్పుడు ఒక వారం మాత్రమే సమయం ఉంది.

By M.S.R  Published on  25 Feb 2023 5:45 PM IST
కొత్త జెర్సీని విడుదల చేసిన ముంబై ఇండియన్స్

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ ప్రారంభ ఎడిషన్ కు ఇప్పుడు ఒక వారం మాత్రమే సమయం ఉంది. WPL 2023 మొదటి మ్యాచ్ ముంబై ఇండియన్స్ - గుజరాత్ జెయింట్స్ మధ్య మార్చి 4 న DY పాటిల్ స్టేడియంలో జరగనుంది. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2023లో గుజరాత్ జెయింట్స్‌తో మ్యాచ్‌కు ముందు ముంబై ఇండియన్స్ తమ WPL జెర్సీ ఫస్ట్‌లుక్‌ను షేర్ చేసింది. శనివారం సోషల్ మీడియాలో వీడియోను పోస్టు చేసింది. ఫ్రాంచైజీ తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా వీడియోను షేర్ చేసి జెర్సీని ఆవిష్కరించింది.

భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) ఇప్పటికే డబ్ల్యూపీఎల్ తొలి ఎడిషన్ షెడ్యూల్‌ను ప్రకటించింది. ప్రారంభ WPL సీజన్‌లో మొత్తం 5 జట్లు 22 మ్యాచ్‌లు ఆడనున్నాయి. అన్ని WPL మ్యాచ్‌లు ముంబైలోని రెండు వేదికల్లో నిర్వహించనున్నారు. DY పాటిల్, బ్రబౌర్న్ స్టేడియంలలో ఈ మ్యాచ్ లను నిర్వహిస్తూ ఉన్నారు. ఈ టోర్నీలో ముంబై ఇండియన్స్, గుజరాత్ జెయింట్స్, యూపీ వారియర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్.. ఇలా ఐదు జట్లు టైటిల్ కోసం పోరాడనున్నాయి.


Next Story