బబుల్‌లో 8 రోజులు.. క్వారంటైన్‌లో 10 రోజులు..!
BCCI planning 8 day bubble in India.కరోనా మహమ్మారి కారణంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2021 సీజన్ నిరవధికంగా
By తోట వంశీ కుమార్ Published on 8 May 2021 7:58 AM GMTకరోనా మహమ్మారి కారణంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2021 సీజన్ నిరవధికంగా వాయిదా పడిన విషయం తెలిసిందే. దీంతో క్రికెట్ అభిమానులు తీవ్ర నిరాశ చెందారు. ఇక ఇప్పుడు అందరి దృష్టి ఇంగ్లాండ్ వేదికగా జూన్ 18న జరగబోయే వరల్డ్ చాంపియన్ షిప్ పైనల్‌పైనే పడింది. ఈ ఫైనల్‌లో భారత్, న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి. ఇందులో పాల్గొనే జట్టును ఇప్పటికే బీసీసీఐ(భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు) ప్రకటించింది. ఈ మ్యాచ్ అనంతరం భారత జట్టు ఇంగ్లాండ్‌తో ఐదు టెస్టుల సిరీస్ ఆడనుంది.
ఇక ఇంగ్లాండ్ వెళ్లేముందే భారత జట్టు క్రికెటర్లు 8 రోజుల పాటు బయో బుల్‌లో ఉండనున్నారు. ఆ తరువాతనే వారు ఇంగ్లాండ్ వెళ్లి అక్కడ 10 రోజుల తప్పనిసరి క్వారంటన్‌లో ఉండనున్నట్లు బీసీసీఐ అధికారి ఒకరు వెల్లడించారు. ఎలాగూ విమానాలు లేవు కాబట్టి క్రికెటర్లంతా ప్రత్యేక విమానంలోనే వెళ్లాల్సి ఉంది. అలాంటప్పుడు ఇక్కడి బబుల్ నుంచి మరో బబుల్‌లోకి మారడం సులువవుతుంది. ఆటగాళ్లకు దీనివల్ల కొంత అదనపు సమయం లభిస్తుందని బీసీసీఐ చెబుతోంది. బబుల్‌లో ఉన్న సమయంలో క్రికెటర్లకు ఎప్పటికప్పుడు కరోనా టెస్టులు నిర్వహిస్తూనే ఉంటామని తెలిపారు.
వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్ తర్వాత ఇంగ్లాండ్‌తో ఐదు టెస్టుల సిరీస్ ఆరంభం కానుంది. ఆ సిరీస్ సెప్టెంబర్ 14న ముగుస్తుంది. అంటే మూడు నెలలకుపైనే క్రికెటర్లు ఇంగ్లాండ్ లోనే ఉండనున్నారు. దీంతో ప్లేయర్స్ తమ వెంట కుటుంబ సభ్యులను కూడా తీసుకెళ్లే అవకాశం కల్పించనున్నట్లు ఆ బీసీసీఐ అధికారి చెప్పారు. నిజానికి డబ్ల్యూటీసీ ఫైనల్‌కు, టెస్ట్ సిరీస్ ప్రారంభానికి మధ్య నెల రోజుల కంటే ఎక్కు సమయం ఉంటుంది. ఆగస్ట్ 4న ఇంగ్లండ్‌తో తొలి టెస్ట్ ప్రారంభమవుతుంది.