మ్యాచ్‌లు ఓడిపోయి బాధ‌లో ఉన్న ఇద్ద‌రు కెప్టెన్‌ల‌కు భారీ షాక్‌..!

పంజాబ్ కింగ్స్ కెప్టెన్ సామ్ కుర్రాన్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ ఫాఫ్ డు ప్లెసిస్ వేర్వేరు ఆరోపణల కారణంగా జరిమానా బారిన‌ప‌డ్డారు

By Medi Samrat  Published on  22 April 2024 7:15 AM GMT
మ్యాచ్‌లు ఓడిపోయి బాధ‌లో ఉన్న ఇద్ద‌రు కెప్టెన్‌ల‌కు భారీ షాక్‌..!

పంజాబ్ కింగ్స్ కెప్టెన్ సామ్ కుర్రాన్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ ఫాఫ్ డు ప్లెసిస్ వేర్వేరు ఆరోపణల కారణంగా జరిమానా బారిన‌ప‌డ్డారు. IPL 2024లో ఆదివారం రెండు మ్యాచ్‌లు జ‌రిగాయి. తొలి మ్యాచ్ కోల్‌కతా నైట్ రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగింది. దీని తర్వాత సాయంత్రం పంజాబ్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య మ్యాచ్‌ జరిగింది. తొలి మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్ కారణంగా ఆర్‌సీబీ కెప్టెన్ ఫాఫ్ డు ప్లెసిస్‌కు రూ.12 లక్షల జరిమానా పడింది. KKRతో మ్యాచ్‌లో RCB 20 ఓవర్లను సమయానికి పూర్తి చేయలేదు. అందుకే కెప్టెన్ డు ప్లెసిస్‌కు 12 లక్షల రూపాయల జరిమానా విధించబడింది. ఐపీఎల్ ప్రవర్తనా నియమావళి ప్రకారం ఇది జట్టు చేసిన మొదటి నేరం కాబట్టి ఫాఫ్‌కు రూ.12 లక్షల జరిమానా విధించారు.

పంజాబ్ కింగ్స్ కెప్టెన్ సామ్ కుర్రాన్ IPL ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు BCCI అతని మ్యాచ్ ఫీజులో 50 శాతం జరిమానా విధించింది. IPL ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.8 ప్రకారం.. సామ్ కుర్రాన్ లెవల్ 1 నేరానికి పాల్పడ్డాడు. మ్యాచ్ రిఫరీ విధించిన ఆరోపణలను కుర్రాన్ అంగీకరించాడు. దీంతో అతని మ్యాచ్ ఫీజు 50 శాతం తగ్గించబ‌డుతుంది. అస‌లే మ్యాచ్ ఓడిపోయిన బాధ‌లో ఉన్న ఇద్ద‌రు కెప్టెన్‌ల‌కు జ‌రిమాన మ‌రికొంత షాక్‌ను క‌లిగించింది.

Next Story