గిల్ కోలుకున్నాడు.. వచ్చేస్తున్నాడు..!

స్టార్‌ బ్యాటర్‌, వైస్‌ కెప్టెన్ శుభ్‌మన్‌ గిల్‌ మ్యాచ్‌ ఫిట్‌నెస్‌ సాధించాడు.

By -  Medi Samrat
Published on : 6 Dec 2025 8:30 PM IST

గిల్ కోలుకున్నాడు.. వచ్చేస్తున్నాడు..!

స్టార్‌ బ్యాటర్‌, వైస్‌ కెప్టెన్ శుభ్‌మన్‌ గిల్‌ మ్యాచ్‌ ఫిట్‌నెస్‌ సాధించాడు. దక్షిణాఫ్రికాతో జరగబోయే తొలి టీ20 నుంచి అతడు అందుబాటులోకి రానున్నాడు. భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (BCCI) సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ వర్గాలు గిల్ ఫిట్ నెస్ ను ధ్రువీకరించాయి. డిసెంబరు 9న కటక్‌ వేదికగా భారత్‌- సౌతాఫ్రికా మధ్య మొదలయ్యే టీ20 సిరీస్‌కు గిల్‌ అందుబాటులోకి రానున్నాడు.

దక్షిణాఫ్రికాతో తొలి టెస్టు సందర్భంగానే గిల్‌ గాయపడి జట్టుకు దూరమయ్యాడు. మెడనొప్పి కారణంగా బ్యాటింగ్‌ మధ్యలోనే నిష్క్రమించిన గిల్‌ ఆ తర్వాత ఆస్పత్రిలో చేరాడు. గిల్‌ టీ20 సిరీస్‌కు అందుబాటులో ఉంటాడో లేదోనన్న సందేహాలు నెలకొన్నాయి. అయితే గిల్‌ మ్యాచ్‌ ఫిట్‌నెస్‌ సాధించినట్లు బీసీసీఐ వెల్లడించింది.

Next Story