దక్షిణాఫ్రికా సిరీస్‌కు భారత మహిళల జట్టు ఎంపిక
Bcci announces India womens ODI and T20 squads for south africa series.కరోనా మహమ్మారి అనంతరం భారత మహిళల జట్టు
By తోట వంశీ కుమార్ Published on 27 Feb 2021 4:28 PM ISTకరోనా మహమ్మారి అనంతరం భారత మహిళల జట్టు తిరిగి అంతర్జాతీయ క్రికెట్ ఆడేందుకు సిద్దమైంది. మార్చిలో భారత్‌లో దక్షిణాఫ్రికా మహిళల జట్టు పర్యటించనుంది. ఈ పర్యటనలో దక్షిణాఫ్రికా జట్టు భారత్‌తో ఐదు వన్డేలు, మూడు టీ20లు ఆడనుంది. తొలి వన్డే లఖనవూ వేదికగా మార్చి 7 నుంచి ప్రారంభం కానుంది. కాగా.. వన్డే, టీ20ల్లో పాల్గొనే మహిళల జట్టును భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) శనివారం ప్రకటించింది. సీనియర్ బ్యాట్స్ఉమెన్ మిథాలీ రాజ్ వన్డేలకు సారథ్యం వహించనుండగా.. టీ20లకు హర్మన్‌ప్రీత్ కౌర్ కెప్టెన్‌గా వ్యవహరించనుంది. సీనియర్ పేస్ బౌలర్ శిఖా పాండే, వికెట్ కీపర్ తినియా బాటియాకు జట్టులో స్థానం దక్కలేదు. యువ సంచలనం ఫెషాలి వర్మ టీ20ల్లో ఆడనుంది.
NEWS: India Women's squad for ODI and T20I series against South Africa announced. @Paytm #INDWvSAW #TeamIndia
— BCCI Women (@BCCIWomen) February 27, 2021
Details 👉 https://t.co/QMmm96qcOt pic.twitter.com/tKjvevd6qH
వన్డే జట్టు : మిథాలీ రాజ్( కెప్టెన్), స్మృతి మంధాన, పూనమ్ రౌత్, జెమియా, ప్రియా పునియా, ఎస్తికా భాటియా, హర్మన్ ప్రీత్, హేమలత, దీప్తి శర్మ, సుష్మ వర్మ( వికెట్ కీపర్), శ్వేత వర్మ( వికెట్ కీపర్), రాధా యాదవ్, రాజేశ్వరీ గైక్వాడ్, జులన్ గోస్వామి, మన్సి జోషి, పూనమ్ యాదవ్, ప్రత్యూష, మోనిక పటేల్
టీ20 జట్టు : హర్మన్ ప్రీత్(కెప్టెన్), స్మృతి మంధాన, ఫెషాలి వర్మ, జెమియా, దీప్తి శర్మ, రిచా ఘోష్, హర్లీన్, సుష్మ(వికెట్ కీపర్), పర్వీన్ ( వికెట్ కీపర్), అయూషి సోని, అరుంధతి, రాధా యాదవ్, రాజేశ్వరీ, పూనమ్ యాదవ్, మన్సి జోషి, మోనిక పటేల్, ప్రత్యూష సిమ్రాన్