రోహిత్‌కు విశ్రాంతి.. ర‌హానేకు కెప్టెన్సీ.. కివీస్‌తో టెస్టు సిరీస్‌కు భార‌త జ‌ట్టు ఇదే

BCCI Announces India Test Squad For New Zealand Series.ఈ నెల 25 నుంచి భార‌త్‌, న్యూజిలాండ్ జ‌ట్ల మ‌ధ్య రెండు టెస్టు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  12 Nov 2021 7:56 AM GMT
రోహిత్‌కు విశ్రాంతి.. ర‌హానేకు కెప్టెన్సీ.. కివీస్‌తో టెస్టు సిరీస్‌కు భార‌త జ‌ట్టు ఇదే

ఈ నెల 25 నుంచి భార‌త్‌, న్యూజిలాండ్ జ‌ట్ల మ‌ధ్య రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ ఆరంభం కానుంది. ఈ నేప‌థ్యంలో నేడు న్యూజిలాండ్‌తో త‌ల‌ప‌డ‌బోయే భార‌త జ‌ట్టును బీసీసీఐ ప్ర‌క‌టించింది. ఈ టెస్టు సిరీస్‌కు రోహిత్ శ‌ర్మ‌, బుమ్రా, ష‌మీ, శార్దూల్ ఠాకూర్‌ల‌కు విశ్రాంతినిచ్చారు. కివీస్ జ‌ట్టు భార‌త ప‌ర్య‌ట‌న‌లో మూడు టీ20లు, రెండు టెస్టులు ఆడ‌నుంది. ఇప్ప‌టికే టీ20 సిరీస్‌లో పాల్గొనే జ‌ట్టును ప్ర‌క‌టించ‌గా.. నేడు టెస్టు జ‌ట్టును ప్ర‌క‌టించారు. టీ20 సిరీస్‌తో పాటు తొలి టెస్టుకు విరాట్ కు విశ్రాంతి నిచ్చారు. కాగా..రెండో టెస్టు స‌మ‌యానికి విరాట్ జ‌ట్టుతో క‌ల‌వ‌నున్నాడు. తొలి టెస్టుకు ర‌హానే కెప్టెన్‌గా వ్య‌వ‌హ‌రించ‌నుండ‌గా.. రెండో టెస్టుకు య‌ధావిధిగా విరాట్ కోహ్లీనే నాయ‌క‌త్వం వ‌హిస్తాడ‌ని సెల‌క్ట‌ర్లు ప్ర‌క‌టించారు.

టెస్టు జ‌ట్టు ఇదే..

అజింక్యా రహానే (కెప్టెన్), ఛతేశ్వర పుజారా (వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, శుభ్మన్ గిల్, ఎస్ అయ్యర్, వృద్ధిమాన్ సాహా (కీపర్), కేఎస్ భరత్ (కీపర్), రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, ఎ పటేల్, జె యాదవ్, ఇషాంత్ శర్మ , ఉమేష్ యాదవ్, సిరాజ్, ప్రసీద్ధ్ కృష్ణ

తొలి టెస్టు అనంత‌రం విరాట్ కోహ్లీ జ‌ట్టుతో క‌ల‌వ‌నున్నాడు. అప్పుడు య‌ధావిధిగా కోహ్లీ సార‌ధిగా వ్య‌వ‌హ‌రించ‌నుండ‌గా.. అజింక్యా ర‌హానే వైస్ కెప్టెన్‌గా బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించ‌నున్నారు.

Next Story
Share it