ప్లేయర్ల వార్షిక కాంట్రాక్టులను ప్రకటించిన BCCI..లిస్టులో ఎవరెవరు ఉన్నారంటే?
టీం ఇండియా సీనియర్ పురుషుల వార్షిక ఆటగాళ్ల కాంట్రాక్టులను సోమవారం ప్రకటించింది.
By Knakam Karthik
ప్లేయర్ల వార్షిక కాంట్రాక్టులను ప్రకటించిన BCCI..లిస్టులో ఎవరెవరు ఉన్నారంటే?
భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) 2024-25 (అక్టోబర్ 1, 2024 నుంచి సెప్టెంబర్ 30, 2025) సంవత్సరానికి టీం ఇండియా సీనియర్ పురుషుల వార్షిక ఆటగాళ్ల కాంట్రాక్టులను సోమవారం ప్రకటించింది. ఈ కాంట్రాక్టులు నాలుగు గ్రేడులుగా విభజించింది. గ్రేడ్ A+, గ్రేడ్ A, గ్రేడ్ B గ్రేడ్ C. వీటి ఆధారంగానే ఆటగాళ్లకు రెమ్యునరేషన్ అందిస్తుంది. కాగా ఇందులో కీలక ప్లేయర్లకు స్థానం లభించింది. అలాగే గత సంవత్సరం గాయాల కారణంగా అవకాశాలను కోల్పోయిన శ్రేయస్ అయ్యర్ తిరిగి అవకాశం దక్కించుకోగా, యువ ప్లేయర్లు అయిన ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డిలకు బిగ్ షాక్ తగిలింది. 2024-25 సీజన్ కోసం మొత్తం 34 మంది ఆటగాళ్లకు వార్షిక రిటైనర్‌షిప్ అందజేశారు. అక్టోబర్ 1, 2024 నుండి సెప్టెంబర్ 30, 2025 మధ్య ఆట కాలాన్ని పరిగణనలోకి తీసుకున్నారు.
2024-25 సంవత్సరానికి BCCI వార్షిక రిటైండర్‌షిప్
గ్రేడ్ A+: రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా.
గ్రేడ్ A: మహ్మద్ KL రాహుల్, శుభమన్ గిల్, హార్దిక్ పాండ్యా, Md. షమీ, రిషబ్ పంత్.
గ్రేడ్ B: సూర్యకుమార్ యాదవ్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, యశస్వి జైస్వాల్, శ్రేయాస్ అయ్యర్.
గ్రేడ్ C: రింకూ సింగ్, తిలక్ వర్మ, రుతురాజ్ గైక్వాడ్, శివమ్ దూబే, రవి బిష్ణోయ్, వాషింగ్టన్ సుందర్, ముఖేష్ కుమార్, సంజు శాంసన్, అర్ష్‌దీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ, రజత్ పాటిదార్, ధృవ్ జురెల్, సర్ఫరాజ్ ఖాన్, నితీష్ కుమార్ రెడ్డి, ఇషాన్ కిషన్, అభిషేక్ దీప్కర శర్మ, అభిషేక్ దీప్కర శర్మ.
ఈ కాంట్రాక్టుల ప్రకటనను BCCI ప్రధానంగా ఫిట్‌నెస్, ప్రదర్శన ఆధారంగా ఎంపికలు చేసినట్టు తెలుస్తోంది. యువ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వడంలో ఈ ఏడాది కాంట్రాక్టులు కీలకంగా నిలిచాయి.