చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్, పాక్‌పై తొలిటెస్టు విజయం
బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు చరిత్ర క్రియేట్ చేసింది. పాకిస్థాన్‌పై తొలి టెస్టు విజయాన్ని నమోదు చేసుకుంది
By Srikanth Gundamalla Published on 26 Aug 2024 2:53 AM GMTచరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్, పాక్‌పై తొలిటెస్టు విజయం
బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు చరిత్ర క్రియేట్ చేసింది. పాకిస్థాన్‌పై తొలి టెస్టు విజయాన్ని నమోదు చేసుకుంది. రావల్పిండి వేదికగా పాకిస్తాన్‌తో బంగ్లాదేశ్ జట్టు తొలి టెస్టు మ్యాచ్ ఆడింది. ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ జట్టుపై బంగ్లాదేశ్ ఏకంగా పది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో రెండు టెస్టుల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో దూసుకెళ్లింది. తొలి టెస్టు మ్యాచ్‌లో టాస్ గెలిచిన బంగ్లాదేశ్ బౌలింగ్ ఎంచుకుంది. తొలి ఇన్నింగ్స్‌లో పాకిస్థాన్ 16 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. సయిమ్ అయూబ్ 56 పరుగులు చేసి టీమ్‌ను ఆదుకున్నాడు. దాంతో.. పాకిస్థాన్ జట్టు స్కోరు వంద పరుగులు దాటింది. ఆ తర్వాత సౌద్ షకీల్ 141 పరుగులు, మహ్మద్ రిజ్వాన్ 171 భారీ శతకాలు బాదడంతో పాక్ కోలుకుంది. తొలి ఇన్నింగ్స్‌లో 448 పరుగులకు ఆలౌటయ్యింది.
పాకిస్థాన్ మంచి స్కోరు చేసింది. అయితే.. బంగ్లాదేశ్ బ్యాటర్లు మాత్రం అంతకు మంచి అన్నట్లుగా ఆడేశారు. చెలరేగిపోయి పాక్ జట్టుకు చుక్కలు చూపించారు. ముష్ఫికర్ 191 పరుగులు చేశాడు. జస్ట్‌లో డబుల్ సెంచరీ మిస్ చేసుకున్నాడు. ఇక ఓపెనర్ షాద్మన్ ఇస్లాం 93 పరుగులు చేశాడు. మెహదీ హసన్ 77 , లిట్టన్ దాస్ 56 , మోమినుల్ 50 పరుగులతో రాణించారు. దీంతో బంగ్లాదేశ్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 565 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. బంగ్లాదేశ్‌కు తొలి ఇన్నింగ్స్‌లో 117 పరుగుల ఆధిక్యం లభించింది. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో ఓకే అనిపించిన పాకిస్థాన్ బ్యాటర్లు రెండో ఇన్నింగ్స్‌లో కుప్పకూలారు. ఘోరంగా విఫలమై.. సెకండ్ ఇన్నింగ్స్‌లో 146 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ఓ దశలో 67 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది పాక్. అప్పుడే రిజ్వాన్ హాఫ్ సెంచరీతో ఆతిథ్య జట్టును ఆదుకున్నాడు. ఓపెనర్ షఫీక్, రిజ్వాన్ తప్ప మిగతావరెవరూ నిలబడలేకపయారు. ఇక బంగ్లాదేశ్ స్పిన్నర్లలో మెహదీ హసన్ 4 వికెట్లు తీశాడు. షకీబ్ అల్ హసన్ 3 వికెట్లు పడగొట్టాడు.
తొలి ఇన్నింగ్స్‌లో 117 పరుగుల ఆధిక్యం ఉంది కాబట్టి.. రావల్పిండి టెస్టులో గెలవడానికి బంగ్లాకు మరో 30 పరుగులే కావాల్సి వచ్చింది. స్వల్ప లక్ష్యాన్ని బంగ్లా ఓపెనర్లు ఊదేశారు. దాంతో.. పది వికెట్ల తేడాతో పర్యాటక జట్టు పాకిస్తాన్‌పై విజయాన్ని అందుకుంది. బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు పాకిస్థాన్‌పై తొలి టెస్టు విజయాన్ని అందుకున్నారు. 2022లో ఆస్ట్రేలియా సిరీస్ దగ్గర్నుంచి ఇప్పటి వరకూ సొంత గడ్డపై పాకిస్థాన్ జట్టు ఒక్క టెస్టు మ్యాచ్ కూడా గెలవలేదు. ప్రధాన స్పిన్నర్లు లేకపోవడం వల్లే బంగ్లాపై ఓటమికి కారణమని పాక్ జట్టు భావిస్తోంది.