నేపాల్ vs బంగ్లాదేశ్.. ఒక్క మ్యాచ్.. ఎన్నో రికార్డులు బద్ధలయ్యాయి..!
నేపాల్‌ను ఓడించి బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు T20 ప్రపంచ కప్ 2024 సూపర్ 8లోకి ప్రవేశించింది. బంగ్లాదేశ్ జట్టు ప్రస్తుత ప్రపంచకప్‌లో సూపర్ 8కి చేరిన చివరి జట్టు.
By Medi Samrat Published on 17 Jun 2024 8:53 AM GMTనేపాల్‌ను ఓడించి బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు T20 ప్రపంచ కప్ 2024 సూపర్ 8లోకి ప్రవేశించింది. బంగ్లాదేశ్ జట్టు ప్రస్తుత ప్రపంచకప్‌లో సూపర్ 8కి చేరిన చివరి జట్టు. ఈ మ్యాచ్‌లో నేపాల్ జట్టు టాస్ గెలిచి ముందుగా ఫీల్డింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ జట్టు 106 పరుగులు చేయగలిగింది. దీనికి సమాధానంగా బ్యాటింగ్‌కు దిగిన నేపాల్ జట్టు.. 4 బంతులు మిగిలి ఉండగానే 85 పరుగులకే కుప్పకూలింది. దీంతో బంగ్లాదేశ్ 21 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో కొన్ని రికార్డులు నమోదయ్యాయి. ఈ రికార్డులను ఒకసారి పరిశీలిద్దాం.
టీ20 ప్రపంచకప్‌లో తాంజిమ్ హసన్ చరిత్ర సృష్టించాడు. నేపాల్‌పై అద్భుతంగా బౌలింగ్ చేసి 4 ఓవర్లలో 7 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. టీ20 ప్రపంచకప్‌లో అత్యధిక డాట్ బాల్స్ వేసిన తొలి బౌలర్‌గా నిలిచాడు.
ఈ మ్యాచ్‌లో ముస్తాఫిజుర్ రెహ్మాన్ కూడా నాలుగు ఓవర్లు బౌలింగ్ చేసి ఏడు పరుగులు మాత్రమే ఇచ్చి మూడు వికెట్లు తీసాడు. దీంతో బంగ్లాదేశ్ తరుపున ఈ ఏడాది ప్రారంభంలో హ్యూస్టన్‌లో అమెరికాపై అదే ఫీట్‌ను సాధించిన రిషాద్ హుస్సేన్‌ను రికార్డును ముస్తాఫిజుర్ సమం చేశాడు.
నేపాల్‌పై బంగ్లాదేశ్ 106 పరుగులకు ఆలౌటైంది, పురుషుల T20 ప్రపంచ కప్‌లో అసోసియేట్స్‌పై ఫుల్ మెంబర్ చేసిన రెండవ అత్యల్ప స్కోరు కావడం విశేషం. అంతకుముందు 2014లో నెదర్లాండ్స్‌పై ఇంగ్లండ్ 88 పరుగుల అత్యల్ప స్కోరు చేసింది.
ఇక ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ జట్టు 106 పరుగులు చేసింది. ప్రతిస్పందనగా నేపాల్ జట్టు 85 పరుగులు మాత్రమే చేయగలిగింది. తద్వారా బంగ్లాదేశ్ ఈ స్కోరును కాపాడుకుంది. ఈ ఏడాది టీ20 ప్రపంచకప్‌లో లోస్కోరింగ్ విక్టరీగా రికార్డు నమోదైంది. గత వారం ప్రారంభంలో న్యూయార్క్‌లో బంగ్లాదేశ్‌పై దక్షిణాఫ్రికా జట్టు కూడా 113 పరుగులను కాపాడుకోగలిగింది. ఈ టోర్నమెంట్‌లో పాకిస్తాన్‌పై 119 పరుగులను డిఫెండ్ చేయడం ద్వారా భారత్.. శ్రీలంక రికార్డును సమం చేసింది. గతంలో 2014 ఎడిషన్‌లో న్యూజిలాండ్‌పై శ్రీలంక 119 పరుగులను డిఫెండ్ చేసిన రికార్డును కలిగి ఉన్నారు.
T20 ప్రపంచకప్‌లో అత్యల్ప స్కోరింగ్ మ్యాచ్‌లో నెగ్గిన జట్లు ఇవే..
2024లో బంగ్లాదేశ్ vs నేపాల్ చేతిలో 106 ఆలౌట్ (సెయింట్ విన్సెంట్)
2024లో దక్షిణాఫ్రికా vs బంగ్లాదేశ్‌తో 113/6 (న్యూయార్క్)
2024లో భారత్ వర్సెస్ పాకిస్థాన్ 119 ఆలౌట్ (న్యూయార్క్)
2014లో శ్రీలంక vs న్యూజిలాండ్ ద్వారా 119 ఆలౌట్ (చటోగ్రామ్)
2016లో ఆఫ్ఘనిస్తాన్ vs వెస్టిండీస్ 123/7 (నాగ్‌పూర్)