బాబర్‌కు ఎంతటి కష్టమొచ్చింది.. కెప్టెన్ రిజ్వాన్ కాదు తానేనంటూ( వీడియో వైరల్)
Babar furiously mouths main kaptaan hu as umpire signals for DRS after Rizwan's appeal.పాకిస్తాన్‌కు శ్రీలంక షాకిచ్చింది
By తోట వంశీ కుమార్ Published on 10 Sep 2022 8:11 AM GMTఆసియాకప్ 2022లో భాగంగా ఆఖరి సూపర్-4 మ్యాచ్‌లో పాకిస్తాన్‌కు శ్రీలంక షాకిచ్చింది. ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. దుబాయ్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 19.1 ఓవర్లలో 121 పరుగులకే కుప్పకూలింది. లంక బౌలర్లలో వానిందు హసరంగా మూడు, మహీశ్ తీక్షణ, ప్రమోద్ మదుషన్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యాన్ని లంక 17 ఓవర్లలో 5 వికెట్ల కోల్పోయి చేదించింది. నిస్సంక(55 నాటౌట్; 48 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో ) అర్థశతకంతో రాణించాడు. పాక్ బౌలర్లలో మమమ్మద్ హస్‌నైన్, హ్యారీస్ రౌఫ్ చెరో వికెట్లు తీయగా.. ఉస్మాన్ ఖదీర్ ఓ వికెట్ పడగొట్టాడు.
ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్‌లో ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. లంక బ్యాటింగ్ చేస్తుండగా.. 16వ ఓవర్‌ను పాక్ బౌలర్ హాసన్ అలీ వేశాడు. మూడో బంతిని బౌన్సర్ వేయగా.. బ్యాట్స్‌మెన్ షనక కట్ షాట్ ఆడేందుకు యత్నించాడు. అయితే.. బంతి మిస్ అయి కీపర్ చేతుల్లోకి వెళ్లింది. దీంతో కీపర్ రిజ్వాన్ ఔట్ కోసం అప్పీలు చేయగా.. ఫీల్డ్ అంపైర్ అనిల్ చౌదరి నాటౌట్‌గా ప్రకటించాడు.
వెంటనే రిజ్వాన్ రివ్యూ కోసం అంఫైర్‌కు సిగ్నల్ ఇవ్వగా.. వెంటనే అంపైర్ థర్డ్ అంపైర్‌కు రిఫర్ చేశాడు. రిప్లేలో బంతి బ్యాట్‌కు తాకలేదని తేలింది. దీంతో అంపైర్ నాటౌట్ ఇచ్చాడు. అయితే.. ఇక్కడే అసలు సమస్య ఉంది. క్రికెట్ నిబంధనల ప్రకారం కెప్టెన్ రివ్యూ అడిగితేనే ఫీల్డ్ అంఫైర్లు.. థర్డ్ అంఫైర్ కి రిఫర్ చేయాలి. అయితే.. ఇక్కడ రిజ్వాన్ రివ్యూ కోసం సిగ్నల్ ఇవ్వగానే.. అంపైర్ అనిల్ చౌదరి కెప్టెన్ ఎవరా? అనే విషయం మరిచి థర్డ్ అంపైర్‌ను సంప్రదించాడు.
— cricket fan (@cricketfanvideo) September 9, 2022
ఈ విషయమై పాక్ కెప్టెన్ బాబర్ ఆజాం అంపైర్‌పై అసహనం వ్యక్తం చేశాడు. కెప్టెన్ రిజ్వాన్ కాదని, తానని అంపైర్‌కు బాబర్ సైగల ద్వారా చెప్పాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై నెటీజన్లు ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు.
ఇదిలా ఉంటే.. దుబాయ్ వేదికగా పాక్, శ్రీలంక జట్లు ఫైనల్‌లో టైటిల్ కోసం పోటీపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో విజేతగా నిలిచిన జట్టు ఆసియా కప్-2022 టోర్నీ విజేతగా నిలవనుంది.